भारतकोश
चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

पृष्ठ 224, कुल 674 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 224

ఆంధ్రతాత్పర్యసహితము. 205

విధము చేయఁబడిన తైలముగాని నేయిగాని దాహమును పోఁగొట్టును. వాతపిత్తములను గూడ నశింపఁజేయును.

ఫలిన్యాదిలేపము.

శ్లో. ఫలినీలోధ్ర సేవ్యాంబు హేమపత్రం కుటన్నటం, కాలీయకరసోపేతం దాహేశస్తం ప్రలేపనమ్. 7. హ్రీబేర పద్మకోశీరం చందనక్షోదవారిణా, సంపూర్ణా మవగాహేత ద్రోణీం దాహార్దితో నరః. 8.

ప్రేంకణపుటాకులు లొద్దుగ వట్టివేరు కురువేరు నాగకేసరములు వీటితో నాన్చిన యుదకమును దుండిగపుచెట్టు పద్మకము తుంగముస్తలు వీటిని చందనపురసముతో జేర్చి లేపము చేయుట దాహములయందు శ్రేష్ఠము. కురువేరు పద్మకము వట్టివేళ్లు చందనము వీటిచూర్ణము కలిపిన నీటితో పూర్తిగా గొంతువఱకు మునిగినటైన దాహము శమించును.

ఇట్లు చక్రదత్తయందు దాహాధికారప్రకరణము ముగిసెను.

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित) · पृष्ठ 224, कुल 674 में से · BharatKosha