चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 268, कुल 674 में से
संदर्भ में पढ़ेंఆంధ్ర తాత్పర్యసహితము. २४९
शोष मुपागताश्च फलिन स्स्निग्धा भवन्ति स्थिराः, भग्नाङ्गा स्सुदृ ढा भवन्ति मनुजा गावो हयाश्च कुञ्जराः. २०७.
కొమ్మలు వేళ్లు ఆకులతోగూడ గొంతిముగోరును ३०० పలములును, గోరంట २०० పలములును, తిప్పతీగె २०० పలములు, చిట్టాముదము २०० పలములును సన్న రాస్న శీరిషము १०० పలములు, దేవదారు మొగిలివేళ్లు १०० పలములు, వీటినన్నిటిని నూరుద్రోణముల నీటిలో పక్వము చేయవలయును. ఈ నీళ్లన్నియును రెండుద్రోణములుగా దిగంగాచిన తరువాత తైలము నొకద్రోణమును, యవగంజి నొకద్రోణమును, మజ్జిగ ६४ పలములు, చెఱుకురసము ६४ పలములు, పాలు ६४ పలములు, శుక్రమును ६४ పలములును మేకమాంసరసమును ६४ పలములును స్పృక్క జీవకాదిగణములోని యౌషధలను మంజిష్ఠ కాకోలి దూలగొండి చిన్నయేలకులు కర్పూరము మల్లెమొగ్గలు దేవదారువు కేసరి గుమ్ముడి జటామాంసి నఖము సుగంధద్రవ్యము మ్రానిపసుపు కమలములు పద్మాక్షము పసపు కంకోలము మోడి సంపెంగ నల్లకురువేరు లవంగపుపట్ట పోక కటుకరోహిణి జాజికాయ పిల్లపీచుర శ్రీవాసధూపము దేవదారు చందనము వస సైంధవలవణము రసాంజనము తుంగముస్తెలు గొంతిముగోరువేళ్లు శొంఠి ఖురాసానివాము వాము కస్తూరి దశమూలములు మొగలిపట్ట గ్రంథితగరము కామాంచి పెన్నేరు రేణుకలు కరకకాయలు ఉసిరిక తాడి రేణుక శల్లకి అగరు పేరింభణము పెద్దపిల్లిపీచర నల్లుగుంధి సదాప జీడివిత్తనములు కమలకేసరములు కోడిసెపాలవిత్తనములు లవంగములు శొంఠి మిరియములు పిప్పళ్లు వీటి నన్నిటిని మూడుమూఁడు పలముల చొప్పున చేకొని కల్కమును చేసి మిక్కిలి పెద్దపాత్రలో వైచి సన్నని సెగలో పక్వము చేయవలయును. దీనిని పానము వస్తికర్శ నస్యము వీటియందు యథావిధిగా నుపయోగించిన వాతములను నశింపఁజేయును. సర్వాంగవాతము అర్ధాంగవాతము అంగగతవాతము సంధిగతవాతము అస్థిగతవాతము మజ్జాగతవాతము కఫరోగము పిత్తరోగము మున్నగు ననేకవిధము లగు రోగములను నశింపంజేయును. ధాతుపుష్టిని గలుగఁజేయును. పురుషులకు నూత్నయౌవనమును స్థిరపఱచును. ముసలికి మిగుల బలకరము అగును. గొడ్రాలికి గర్భమును నిలుపును. ఈ తైలమును ద్రాగెనేని వృద్ధురాలును పుత్రుని కనును. ఎండిపోయిన చెట్టునకు ఈ తైలోదకమును చల్లినయెడల ఫలపుష్పసహితముగా చిగుర్కొనును. భగ్నాంగుఁడు దృఢకాయుఁ డగును. ఎద్దులు గుఱ్ఱములు ఏనుగులు మున్నగువానివలె బలియును.
अष्टादशशतक प्रसारणीतैलम्
श्लो. समूलदलशाखायाः प्रसारण्याः शतत्रयम्, शत मेकं शतावर्या अश्वगन्धाशतं तथा. २०८. केतकीनां शतं चै
३२