चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 282, कुल 674 में से
संदर्भ में पढ़ेंఆంధ్ర తాత్పర్యసహితము. 263
గుమ్ముడి సన్నరాస్న పల్లేరు తెల్లఆముదపువేళ్లు తుంగముస్తెలు తెల్లకలువలు వీటిని సమానభాగములుగా దెచ్చి కల్కమును చేసి 16 పలముల నేతిని పక్వము చేయవలయును కాని ఉసిరిక రసము 16 పలములును నీళ్లు 48 పలములును చేర్చి బాగా పాకమయిన పిమ్మట పరీక్షించి అన్నము తినునప్పుడును త్రాగెడి నప్పుడు నుపయోగింపవలయును. అనేక దోషములతో గూడిన వాతరోగములను రక్తముతో కలిసిన వానిని ఉత్థానవాతమును కటిస్థలములయందును పిక్కలయందును తొడలయందును పుట్టెడివాతములను పోగొట్టును.
క్రోష్టు శీర్షములయందును శూలలయందును భయంకరములగు నామవాతముల యందును వాతరోగముగలవానికిని సహింపరాని వేదనను పోగొట్టి గుణమును కలిగించును. మూత్రకృచ్ఛ్రము ఉదావర్తము ప్రమేహము విషమజ్వరము వాతపిత్తకఫముల వలనఁ గలిగెడి జ్వరములను పోగొట్టును. దీనిని అన్నిసమయములందు నుపయోగించిన మంచికాంతిని వయస్సును బలమును వృద్ధి నొందించును. ఇయ్యది అశ్వినీదేవతలచేత నిర్మింపఁబడిన యత్యుత్తమమగు ఘృతము శ్రేష్ఠమైనది.
దశపాక బలా తైలము.
శ్లో. బలాకషాయకల్కాభ్యాం తైలం క్షీరచతుర్గుణమ్, దశపాకం భవే దేత ద్వాతాసృ గ్వాతపిత్తజిత్. 32. ధన్యం పుంసవనం చైవ నరాణాం శుక్రవర్ధనమ్, రేతో యోని వికారఘ్నం మేఢ్ర ద్యాతవికారనుత్. 33.
ముత్తువపులగమును కషాయమునుగాను కల్కమును గాను చేసి అంతకు నాలుగురెట్లు తైలమును పాలను కలిపి పక్వము చేయవలయును. ఇట్లు ఇది దశపాకమైన ముత్తువపులగపు తైలమగును. ఇయ్యది వాతరక్తములను వాతపిత్తములను పోగొట్టును. ధన్యమగు పుంస్త్వము నిచ్చును. రేతస్సును వృద్ధి నొందించును. వీర్యవికారములను యోనివికారములను పోగొట్టును. మరియు నియ్యది వాతవికారములను పోగొట్టును.
గుడూచ్యాదితైలము.
శ్లో. గుడూచీక్వాథదుగ్ధాభ్యాం తైలం లాక్షారసేన వా, సిద్ధం మధుకకాశ్యర్యరసై ర్వా వాతరక్తనుత్. 34.
తిప్పతీగె కషాయము పాలు గాని లక్కరసమునుగాని యష్టిమధుకము గుమ్ముడు రసమునుగాని చేర్చి సిద్ధము చేసినతైలము వాతరక్తములను పోగొట్టును.