भारतकोश
चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

पृष्ठ 283, कुल 674 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 283

264 చక్రదత్త—౨౩. వాతరక్తాధికారము.

ఖుజ్జాకపద్మక తైలము.

శ్లో. పద్మకోశీరయష్ట్యాహ్వ రజనీ క్వాథసాధితమ్, స్వాతై
లైః సర్జమంజిష్ఠా వీరా కాకోలీ చందనైః. 35. ఖుజ్జాకపద్మక మిదం
తైలం వాతాస్రదోషనుత్.

పద్మాక్షము వట్టివేళ్లు యష్టిమధుకము పసపు వీటికషాయములో మద్ది చెక్క, మంజిష్ఠము కాకోలి చందనము వీటికల్కమును కలిపితైలమును సిద్ధము చేయవలయును. ఇయ్యది వాతరక్తదోషములను పోఁగొట్టును. ఇది ఖుజ్జాకపద్మకతైల మనఁబడును.


పెద్దముత్తువపులగపుతైలము.

శ్లో. శుద్ధాం వచే న్న గబలాతులాం తు, విస్రావ్య తైలాఢక
మత్ర దద్యాత్, అజాపయస్తుల్యవిమిశ్రితం తు, న తస్య యష్టీమధు
కస్య కల్కమ్. 36. పృథక్పచే త్పంచపలం విపక్వం, తద్వాతరక్తం
శమయ త్యుదీర్ణమ్, వస్తిప్రదానా దిహ సప్త రాత్రా, త్పీతం దశాహా
త్కృకరో త్యరోగమ్, తులా ద్రవ్యే జలద్రోణోద్రోణేద్రవ్యతులామతా.

పెద్దముత్తవపులగమును శుద్ధిచేసి 400 తులములు తెచ్చి రసము తీసి దానిలోఁ 64 పలముల నూనెను కలిపి 64 పలముల మేకపాలను తెచ్చి తగరమును ముత్తువపులగమును వేరువేరుగా అయిదేదు పలముల కల్కమును చేసి పక్వము చేసి సేవించవలయును. ఇయ్యది పెచ్చుపెరిగిన వాతరక్తములను కూడ శాంతి నొందించును. వస్తులమూలముగా దీనిని ఉపయోగ పెట్టుటవలన ఏడురాత్రులలోను త్రాగుటవలన పదిదినములలోను రోగములను తొలఁగించివైచును. ఇచ్చట తులపరిమితమగు ద్రవ్యమునందు ఒక ద్రోణమునీరును ద్రోణము నీటిలో నొక తులద్రవ్యమునుచేర్చదగునని సంప్రదాయము.


పిండతైలము.

శ్లో. సమధూచ్ఛిష్ట మంజిష్ఠం ససర్జరస శారివమ్, పిండతైలం
తదభ్యంగా ద్వాతరక్త్రుజాపహమ్. 38.

తేనెమైనము మంజిష్ఠము సజ్జరసము మనుబాల వీటితో తైలమును పక్వము చేయవలయును. ఇయ్యది పిండతైలమనఁ బడును. దీనిని రుద్దినయెడల వాతరక్తపు దోషము లన్నియును నశించిపోఁగలవు.