भारतकोश
चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

पृष्ठ 289, कुल 674 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 289

270 చక్రదత్త—౨౪. ఊరుస్తంభాధికారము.

త్రాఢ్యైః కరంజఫలసర్షపైః, క్షౌద్రసర్షపవల్మీక మృత్తికాసంయుతం భిషక్. 10. గాఢ ముత్సాదనం కుర్యా దూరుస్తంభే ప్ర లేపనం, కఫక్షయార్థం వ్యాయామై ష్వేనం శక్త్యాచయోజయేత్. 11. స్థలా న్యాక్రామయే త్కల్కం ప్రతిస్రోతో నదీం తరేత్, పలాభ్యాం పిప్పలీమూల నాగరా దష్టకట్వరః. 12.

శ్లేష్మమును పోఁగొట్టునదియును, వాయువును ప్రకోపింపఁజేయునిదియు నగు యౌషధమునంతును ఊరుస్తంభమునకు ప్రయోగింపవలయును. ఊరుస్తంభనగల రోగికి స్నేహనము గాని వస్తిక రగాని రేచనముగాని చేయరాదు. రూక్ష చికిత్సలనే యన్నిటిని చేయుచుండవలయును. అందనను కఫనాశకచికిత్సలను చేయవలయును. ఆసివుట వాతము నశించుటకై క్రియాక్రమము నంతయును జటింపవలసినదియే. శిలాజిత్తు గుగ్గులుము పిప్పళ్లు శొంఠి వీటిని ఆవుపంచితములో గాని దశమూలముల రసముతో గాని ఊరుస్తంభముగలవాడు సేవింపవలయును. నల్లజీలకఱ్ఱవిత్తనములు తిప్పతీగె శొంఠి దేవదారువు కరక్కాయలు గలిజేరు దశమూలములు వీటితో కషాయము చేసి పుచ్చుకొనిన యూరుస్తంభములు నశించును. పిప్పళ్లు మోడి నల్లజీలదివిత్తనములు వీటికషాయమునందుగాని కల్కమునందుగాని తేనెను కలిపి యిచ్చినయెడల ఊరుస్తంభములు నశించును. నెమలియడుగువేళ్లు త్రిఫలములు ఆవాలు వీటిని ఆవుపంచితముతో నూరి పట్టువేసినను సేకముచేసినను ఊరుస్తంభములు నశించిపోగలవు. తేనెయును ఆవాలును పుట్టమట్టియును వీటితో లేపనముచేసిన ఊరుస్తంభములు తగ్గిపోవును. కఫము తగ్గిపోవుట కొఱకై కసనతులయం దీనిఁగొని ప్రవేశపెట్టవలయును. ఏటికడ్డముగా నీదింపవలయును.

❧ అష్టకట్వరతైలము. ❧

శ్లో. తైలప్రస్థః సమాదధ్నా గృధ్రస్యాసుగ్రహాపహః, అష్టకట్వరతైలై త త్తైలం సార్షప మిష్యతే. 13. కుష్ఠశ్రీవేష్ట కౌదీచ్యం సరళం దారు కేసరం, అజగంధా ౬శ్వగంధా చ తైలం తైస్సార్షపం పచేత్. 14. సక్షౌద్రం మాత్రయాం తస్మా దూరుస్తంభార్దితః పిబేత్, సైంధవాద్యం హితం తైలం వర్షాభ్యమృతగుగ్గులుః. 15.

పిప్పలి మోడి శొంఠి ఒక్కొక్కపలమును పెరుగు 8 పలములును తైలము నెన్నిదినములును కలిపి ఈతైలమును సిద్ధముచేసి యుపయోగించినచో గృధ్రసియును ఊరుస్తంభమును నశించును. ఈయష్టకట్వరతైలమునందు ఆవనూనెనే పోయవలయును.