भारतकोश
चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

पृष्ठ 302, कुल 674 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 302

ఆంధ్రతాత్పర్యసహితము. 283

ఇంగువ పుష్కరమూలములతో గాని, ఇంగువ సౌవర్చలవణములతో గాని, సిద్ధముచేసిన శొంఠి, యాముదపువిత్తులకషాయము శూలలను వెంటనే హరింపఁజేయును. ఏవండయవల కషాయములో ఇంగువ సౌవర్చలవణములను వైచికొని త్రాగినను సుఖమే యగును. ఇంగువ మానిపత్రి పిప్పళ్లు ఉప్పు వామము కరక్కాయలు యవక్షారము వీటిని సమానభాగములుగ చూర్ణముచేసి, వారుణీ మదముతో చేర్చి త్రాగినయెడల వృద్ధిపొందిన వాతశూలలు హరించి సుఖము కలుగును.

సౌవర్చలాదిగుటిక.

శ్లో. సౌవర్చలామ్లికా జాజీ మరీచైర్ద్విగుణోత్తరైః, మాతులుంగరసైః పిష్ట్వా గుడికానిలశూలనుత్ . 13.
హింగ్వమ్ల వేతసవ్యోష యమానీలవణత్రికైః, బీజపూరరసోపేతై ర్గుడికావాత శూలనుత్ : 14.
బీజపూరకమూలం చ ఘృతేన సహ పాయయేత్, జయే ద్వాతభవం శూలం కర్ష మేకం ప్రమాణతః. 15.
బిల్వమూలతిలై రండం పిష్ట్వా చామ్లతుషాంభసా, గుడికాంభ్రామయేదుష్ణాం వాతశూలవినాశినీం. 16.
తిలై శ్చ గుడికాం కృత్వా భ్రామయేజ్జఠరోపరి, గుడికా శమయ త్యేషా శూలం చైవాతిదుస్సహ. 17.
నాభిలేపా జ్జయే చ్ఛూలం మదనః కాంజికాన్వితః, జీవన్తీమూల కల్కో వా సతైలః పార్శ్వశూలనుత్ . 18.

సౌవర్చలవణము 1 భాగము, చింతపండు 2 భాగములు, జీలకఱ్ఱ 4 భాగములు, మిరియములు 8 భాగములు వీటిని మాచిపత్రికరసముతో నూరి మాత్రలుగట్టి సేవించిన వాతశూలములు నశించును. ఇంగువ ఆమ్ల వేతసము శొంఠి మిరియములు పిప్పళ్లు ఓమము త్రిలవణములు వీటిని మాచికాయరసముతో నూరి మాత్రలనుచేసి యిచ్చిన వాతశూలములను హరించును. మాచికాయరసమును నేతితో చేర్చికొని త్రాగిన సంవత్సరమునుండి యుండిన వాతశూలలును నశించును. మారేడు తిలలు ఆముదపువిత్తనములు నీటిని పుల్లనియవలగంజిలో కలిపి నూరి మాత్రలను చేసి వెచ్చజేసి పొట్టపైరుద్దినచో వాతశూలయుల నశించును. తిలలను ఉండలను చేసి కడుపుపై నుంచిన మిక్కిలియును భయంకరములగు వాతరోగములైనను నశించును. ఉమ్మెత్తకాయను గంజితోనూరి బొడ్డుకి పట్టు వేసిన శూలలు నశించును. సువర్ణమనుబాల బెఱడుతో నైన కల్కము నందు తైలమునుకలిపి లేపనముచేసినను పార్శ్వశూలలు నశించును.