भारतकोश
चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

पृष्ठ 346, कुल 674 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 346

ఆంధ్రతాత్పర్యసహితము. 327

చ తత్. 17. యన్మూత్రకృచ్ఛ్రే విహితం తు పైత్తే తత్కా-
-చ్చోణితమూత్రకృచ్ఛ్రే, త్రికంటకారగ్వధదర్భకాశ దురా-
లభాశ్మభేదపథ్యాః, నిఘ్నంతి పీతామధు నాశ్మరీం చ, సం-
పృత్తోఽపి మూత్రకృచ్ఛ్రమ్. 18. కషాయోఽతిబలామూల సాధితః
కృచ్ఛ్రజిత్. 19. ఏలాశ్మభేదకశిలా జతుపిప్పలీనాం చూర్ణాని
తండులజలై ర్లులితాని పీత్వా, యద్వా గుడేన సహితా న్యవలిహ్య
చాసన్నమృత్యు రపి జీవతి మూత్రకృచ్ఛ్రీ. 20. అయోరజః
ఘృతం మధునా సహ యోజితమ్, మూత్రకృచ్ఛ్రం నిహన్త్యాశు
సశ్లేష్మా ర్న సంశయః. 21. సితాతుల్యో యవక్షారః సర్వకృ-
చ్ఛ్రనివారణః, నిదిగ్ధికారసో వాపి సక్షౌద్రః కృచ్ఛ్రనాశనః. 22.

వీర్యబంధకమగు మూత్రకృచ్ఛ్రమునందు శిలాజత్తు తేనె సేవింపవలయును. వీర్య-
దోషములగు నౌషధులచేత స్త్రీసంభోగము కార్యము. ఏలకులు ఇంగువలతో సిద్ధ-
మైన పాలలో నేతిని వైచికొని తాగిన మూత్రదోషములను వీర్యదోషములు
పోవును. పిత్తమూత్రకృచ్ఛ్రచికిత్సలనే రక్తమూత్రకృచ్ఛ్రములకును చేయునది.
పల్లేరు, రేలచెక్క, దర్భగెడ్లు, దూలగొండి, కరక్కాయ వీటికషాయములో తేనెను
కలిపి తాగిన అన్నివిధములగు మూత్రకృచ్ఛ్రములు నశించును. ఏలకులు, పా-
షాణభేది, శిలాజిత్తు, పిప్పళ్లు వీటిచూర్ణమును బియ్యపుకడుగుతో తాగినను బెల్ల-
ముతో కలిపి తినినను మరణాసన్నుండైన మూత్రకృచ్ఛ్రరోగీయును బ్రదుకును. మందూర-
భస్మము చక్కగానూరి తేనెను కలిపి మూడుపూటలు తినిన మూత్రకృచ్ఛ్రములు న-
శించును. తెల్లవావిలి, యవక్షారము సమముగాసేవించినను, వాకుడురసముతో తే-
నెను కలిపితాగినను కృచ్ఛ్రనాశనము అగును.

శతావరీ ఘృతము.

శ్లో. శతావరీకాశకుశశ్వదంష్ట్రా విదారికేక్ష్వామలకేషు సిద్ధం,
సర్పః పయోవా సితయా విమిశ్రం కృచ్ఛ్రేషు పిత్తప్రభ వేషు
శస్తం. 23.

పిల్లపీచర, కాశము, కుశలు, పల్లేరు, నేలగుమ్ముడు, ఉసిరిక వీటితో సిద్ధము-
చేయబడిన నేయి గాని పాలును గాని చక్కెరను కలిపికొని పిత్తజములగు మూత్రకృ-
చ్ఛ్రములకుపయోగించికొనవలయును.