चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 353, कुल 674 में से
संदर्भ में पढ़ें332 చక్రదత్త—33. అశ్మర్యధికారము.
స్త్రీ గర్భవతి యగును. రక్తదోషములు నశించును. సంహతము లగు యోనిదోషము లన్నియు నడుగంటును. సమస్తములగు మూత్రదోషములందును దీనితో చికిత్సఁ జేయవలయును.
ఇట్లు చక్రదత్తయందు మూత్రాఘాతాధికార ప్రకరణము ముగిసెను.
33. అశ్మర్యధికారము.
* అశ్మరీరోగమునకు సామాన్య చికిత్సలు.
శ్లో. వరుణస్య త్వచం శ్రేష్ఠాం శుంఠీ గోక్షురసంయుతాం, యవక్షారగుడం దత్వా క్వాథయిత్వా పిబేద్ధితాం. 1.
అశ్మరీం వాతజాం హన్తి చిరకాలానుబంధినీం, వీరతరః సహచరీ దర్భో వృక్షాదనీ నలః. 2.
గుంద్రాకాశకుశా వర్మ భేదమోరటటుండుకాః, కురంటికాచ వశిరో వసుకః సాగ్నిమంథకః 3.
ఇందీవరీశ్వదంష్ట్రా చ తథా కాపోతవక్త్రకః, వీరతరాది రిత్యేష గణో వాతవికారనుత్. 4.
అశ్మరీ శర్కరామూత్ర కృచ్ఛ్రాఘాతరుజాపహః, శుంఠ్యగ్నిమంథపాషాణ శిగ్రూవరుణగోక్షురైః. 5.
అభయారగ్వధపలైః క్వాథం కుర్యా ద్విచక్షణః, రామఠక్షారలవణ చూర్ణం దత్వా పిబేన్నరః. 6.
అశ్మరీమూత్రకృచ్ఛ్రఘ్నం పాచనం దీపనం పరమ్, హన్యాత్తోత్థాశ్రితం వాతం కట్యూరుగుదమేఢ్రగమ్. 7.
ఉలిమిరిచెక్క శొంతి పల్లేరు వీటికషాయమును యవక్షారము బెల్లములతోసిద్ధము చేసి త్రాగిన చాలకాలమునుండి యున్న అశ్మరియైనను నశించును. కురువేరు గోరింట దర్భ తిప్పతీగె భిద్రముస్తలు కాశము కుశలు చెఱకు పచ్చనిలొద్దుగ పల్లేరు బ్రాహ్మము వీరతరాదిగణమనబడును. ఇయ్యదివాతవికారమును హరించును. అశ్మరిశర్కర మూత్రకృచ్ఛ్రము మూత్రాఘాతములనిది పోఁగొట్టును. శొంతి అగ్నిమంథము పాషాణము మునగ ఉలిమిరి కరక్కాయ రేలపండ్లు వీటితో కషాయము. జేసి ఇంగువ యవక్షారమునుచేర్చి త్రాగిన అశ్మరి మూత్రకృచ్ఛ్రములనుపోఁగొట్టి అగ్నిని దీపింపజేయును. కటి తొడలు గుదస్థానము మేఢ్రస్థానము మున్నగువానిలోగలవాతములను నశింపఁజేయును.
* అశ్మరి యనగా మూత్రద్వారమునందు రాయి నెటిగెడి రోగము.