चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 355, कुल 674 में से
संदर्भ में पढ़ें| 334 | చక్రదత్త—33. అశ్మర్యధికారము. |
|---|
రీం తీవ్ర మేన తు. 17. క్షారా న్యవాగూః పేయా శ్చ కషాయాణి పయాంసి చ, భోజనాని చ కుర్వీత వర్గే౭స్మి న్పిత్తనాశనే. 18.
కుశకాశములు జెల్లు నల్లచెఱకు చెఱకువేళ్లు పల్లేరు కొండపిండి దర్భశాలీమూలము త్రికంటకములు పాటలి అగరుశొంఠి నేలగుమ్ముడు నేలతాడి పత్తూరును గోరింట శిరీషము గలిజేరు వీటితోనైన కషాయములలో సాధించినదియును, శిలాజిత్తు మధుకము కమలబీజములు దోసకాయ కరుబూజావిత్తులు వీటితో ప్రతివాపము చేయఁబడినదియు నగు నేతిని పిత్తాశ్మరీరోగులు త్రాగవలయును.
— వరుణాది ఘృతము. —
శ్లో. గణే వరుణకాదౌ చ గుగ్గుల్వేలాహరేణుభిః, కుష్ఠముస్తాహ్వమరిచ చిత్రకైః ససురాహ్వయైః. 19. ఏతై స్సిద్ధ మజా సర్పి రుషకాదిగణేనచ, భినత్తి కఫసంభూతా మశ్మరీం తీవ్ర మేన తు. 20. క్షారా న్యవాగూః పేయాః శ్చ కషాయాణి పయాంసి చ, భోజనాని ప్రకుర్వీత వర్గే౭స్మి న్కఫనాశనే. 21. వరుణా ర్తగలఃశిగ్రుః తర్కారీ మధుశిగ్రు కాః, మేషశృంగీ కరంజౌ చ బింబ్ర్యగ్నిమంథమోరటాః. 22. శైరేయా శిరీషోదర్భౌ వరీవసుక చిత్రకాః, బిల్వం చైవాజశృంగీ చ బృహతీద్వయమేవచ. 23. వరుణాదిగణో హ్యేష కఫమేదో నివారణః, వినిహంతి శిరఃశూలా గుల్మాంశ్చాంతరవిద్రధీన్. 24.
వరణాదిగణములందును గుగ్గిలము ఏలకులు రేణుక కోష్టు తుంగముస్తలు మిరియములు చిత్రమూలము దేవదారు వీతికషాయమందు నుషికాదిగణమును ప్రతివాపముచేసి సిద్ధముచేసిన మేకపాలు కఫాశ్మరినిబోగొట్టును. కఫనాశకములగు క్షారాదుల నిందు భుజింపవలయును. ఉలిమిరి నల్లగోరింట మునగ తీయమునగ మేషశృంగి నెమిలియడుగుచెక్క దొండపండు అగ్నిమంథము చెఱకు శైరీయము శిరీషము దర్భ వరివసుక చిత్రకములు పిల్లిపీచర బిల్వము అజశృంగి దుష్టుపుతీగె వాకుడు ఇయ్యది వరణాదిగణము. కఫమేదనివారణము. శిరశ్శూల గుల్మము విద్రధి మున్నగువానిని ఇది నశింపఁజేయును.
— వరణాదికషాయము. —
శ్లో. వరుణత్వక్కషాయం తు పీతం చ గుడసంయుతమ్, అశ్మరీం పాతయ త్యాశు వస్తిశూలనివారణమ్. 25. యవక్షారం గుడోన్మి