चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 356, कुल 674 में से
संदर्भ में पढ़ेंఆంధ్రతాత్పర్యసహితము. 335
శ్చం పిబే త్పుష్పఫలోద్భవమ్, రసం మూత్రవిబంధఘ్నం శర్కరాశ్మరి నాశనమ్. 26.
పిబే ద్వరుణమూలత్వ క్క్వాథం తత్కల్కసంయుతం, క్వాథ శ్చ శిగ్రుమూలోత్థః కదుష్ణో శ్వరిఘాతకః. 27.
నాగరవారుణ గోక్షుర పాషాణభేదక పోతనల్కజః క్వాథః, గుడయవశూకమిశ్రః పీతో హన్త్యశ్మరీ ముగ్రామ్. 28.
వరుణత్వక్శిలాభేద శుంఠీగోక్షురకైః కృతః, కషాయః క్షారసంయుక్తః శర్కరాం చ భినత్త్వపి. 29.
శ్వదం ష్ట్రాైరండపత్రాణి నాగరం వరుణత్వచమ్, ఏతత్క్వాథవరం ప్రాతః పిబే దశ్మరిభేదనం. 30.
మూలం శ్వదంష్ట్రాత్తురకోరుభూకాత్ క్షీ రేణ పిష్టం బృహతీద్వయా చ్చ, ఆలోడ్య దధ్నా మధురేణ పేయం దినాసి సప్తాశ్మరిభేదనార్థం. 31.
పక్వేక్ష్వాకురసః క్షారః సితాయుక్తో శ్మరీహరః, పాషాణరోగపీడాం సౌవర్చలయుక్తా సురా జయతి. 32.
తద్వన్న సుదుగ్ధయుక్తా త్రిరాత్రం తిలనాళభూతిశ్చ. 33.
ఉలిమిరికషాయములో బెల్లమును కలిపి త్రాగిన అశ్మరులు శీఘ్రముగా నశించును. వస్తిశూలలు నశించును. యవక్షారమును బెల్లముతో పుష్పఫల రసమును త్రాగిన మూత్రబంధము శర్కరాశ్మరులునశించును. ఉలిమిరిచెక్క కషాయములో కల్కమును వైచి త్రాగినను మునగచెక్కకషాయమును గోరువెచ్చగా త్రాగినను అశ్మరి నశించును. శొంఠి ఉలిమిరి పల్లేరు కొండపిండివేళ్లు బ్రాహ్మీ వీటికషాయములో యవక్షారము బెల్లముఁ గలిసిత్రాగిన శర్కర అశ్మరులు నశించును. ఉలిమిరి కొండపిండి శొంతి పల్లేరు వీటికసాయమును యవక్షారముతోఁత్రాగినచో శర్కరలునశించును. పల్లేరు ఆముదపాకులు శొంతి ఉలిమిరిచెక్క వీటికషాయమును ప్రాతఃకాలమునందు త్రాగిన నశ్మరులు నశించును. పల్లేరు తిలకపుచెక్క ఆముదపువేళ్లు వాకుడు వీటిని పాలతోనూరి పెరుగుతో కలిపి ఏడురాత్రులు త్రాగినచో నశ్మరులు నశించును. చేదుసార రసమును యవక్షారము చక్కెర వీటిని కలిపి త్రాగినచో అశ్మరులు నశించును. అశ్మరీబాధను సౌవర్చలవణముతో చేరిన కల్లును త్రాగిన పోగొట్టును. నువ్వుకట్టెలఁగాల్చిన బూదినిత్రాగినను మూడురాత్రులలో పోగొట్టును.
—•— ఏలాదిక్వాథము. —•—
శ్లో. ఏలోపకుల్యా మధుకాశ్మభేద కాంతీ శ్వదంష్ట్రా వృషకో రుభూకైః, క్వాథం పిబే దశ్మజతుప్రగాఢం సశర్కరే చాశ్మరిమూత్ర కృచ్ఛ్రే. 34.