भारतकोश
चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

पृष्ठ 357, कुल 674 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 357

336 చక్రదత్త—33. అశ్మర్యధికారము.

ఏలకులు పిప్పళ్లు యష్టిమధుకము కొండపిండి వేళ్లు రేణుకబీజములు పల్లేరు అడ్డసరము ఆముదములు వీటిని కషాయమును చేసి వెన్నెగు లక్క వీటిని కలిపి సేవించిన శర్కర మూత్రకృచ్ఛ్రము అశ్మరులు నశించును.

త్రికంటకాది చూర్ణము.

శ్లో. త్రికంటకస్య బీజానాం చూర్ణం మాక్షికసంయుతం, ఆవిక్షీరేణ సప్తాహం పిబే దశ్మరినాశనం. 35. శుక్రాశ్మర్యాం తు సామాన్యో విధి రశ్మరినాశనః.

పల్లేరుగింజలను నూరికొట్టి తేనె నందు కలిపి మేక పాలతో నేడుదినములు త్రాగిన కల్లుగట్టుట (అనగా నశ్మరీరోగము) మానును. తెల్ల అశ్మరియందు అశ్మరీసామాన్య చికిత్సను చేయవలయును.

పాషాణభేదచూర్ణము.

శ్లో. పాషాణ భేదం వృషకం శ్వదంష్ట్రా పాతాభయావ్యోషశటీనికుంభాః, హింస్రాఖరాశ్వాసితమాగధానా మేర్వారుకా చ్ఛత్రపుషాచ్చ బీజం. 36. ఉపకుంచికాహింగుసవేతసామ్లం స్యాద్ద్వేబృహత్యౌ హపుషా వచా చ, చూర్ణం పిబే దశ్మరి భేదిపక్వం సర్పి శ్చ గోమూత్ర చతుర్గుణ తైః. 37.

కొండపిండివేళ్లు అడ్డసరము పల్లేరు అగరుశొంతి కరక్కాయలు శొంతి మిరియములు పిప్పళ్ళు కచ్చూరము కరక్కాయలు శాలింజశాకము నక్కదోసవిత్తులు మున్నగువానిచూర్ణమును నాల్గురెట్లగోమూత్రముతో సిద్ధముచేసి నేతితో త్రాగిన నశ్మరులు హరించును.

కులత్థ చూర్ణము.

శ్లో. కులత్థ సిద్ధోత్థ విడంగసారం సశర్కరం శీతలయావశూకం, బీజాని కూష్మాండక గోక్షురాభ్యాం ఘృతం పచే న్నావరుణస్య తోయే. 38. దుఃసాధ్య సర్వాశ్మరి మూత్రకృచ్ఛ్రం మూత్రాభిఘాతం చ సమూత్రబంధం, ఏతాని సర్వాణి నిహంతి శీఘ్రం ప్రరూఢవృక్షా నివ వజ్రపాతః. 39.

ఉలవలు సైంధవలవణము వాయువిడంగములు కలకండ కర్పూరము యవక్షారము గుమ్మడువిత్తులు పల్లేరు వీటితో ప్రతివాపమును చేసి ఉడమిరికషాయముతో నేతిని త్రాగిన దుస్సాధ్యములగు నశ్మరీరోగము లన్నియును మూత్రకృచ్ఛ్రము మూత్రాభి

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित) · पृष्ठ 357, कुल 674 में से · BharatKosha