भारतकोश
चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

पृष्ठ 40, कुल 674 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 40

ఆంధ్ర తాత్పర్యసహితము. 19

యవం మూర్వాం పటోలం చాపి సాధితం, పిబే న్మరిచసంయుక్తం సక్షౌద్రం శ్లైష్మికే జ్వరే. 103. నింబవిశ్వామృతా దారు శటీభూనింబపౌష్కరం, పిప్పల్యా బృహతీచేతిక్వాథో హంతి కఫజ్వరం. 104. సింధువారదల¹క్వాథం శోషణం కఫజే జ్వరే, జంభూయోశ్చ బలే క్షీణే కర్లే వా విహితే పిబేత్. 105. ఆమలక్యభయా కృష్ణా చిత్రక శ్చేత్యయం గణః, సర్వజ్వరకఫాతంకభేదీ దీపనపాచనః. 106. త్రిఫలాపటోలవాసాచ్ఛిన్నరుహా తిక్తరోహిణీ షడ్గ్రంథాః, మధునా శ్లేష్మసముత్థే దశమూలీవాసకస్య వా క్వాథః. 107. ముస్తం వాత్స్యకబీజాని త్రిఫలా కటురోహిణీ, పరూషకాణి చ క్వాథః కఫజ్వరవినాశనః. 108.

కఫజ్వరచికిత్సా:— మాదీఫలము, శొంతి, సరస్వతిఆకు, మోడి, వట్టివేరు వీటితో చేసిన క్వాథమునందు యవక్షారమును కలిపి త్రాగినయెడల కఫజ్వరములు నశించును. కణాదిక్వాథముచేతఁగూడ నీకఫజ్వరములు పోఁగలవు. కణాదిక్వాథ మనఁగా పిప్పల్యాదికమును వేసి కాచిన కషాయము. పిప్పళ్లు, మోడి, చవ్యము, చిత్రమూలము, శొంతి, మిరియములు, ఏలకులు, ఓమము, దాల్చినపట్ట, అగరుశొంతి, రేణుకలు, జీలకఱ్ఱ, గంటభారంగి, గజనిమ్మపండు, ఇంగువ, కటుకరోహిణి, ఆవాలు, వాయువిళంగములు, అతివస, చాగవేళ్లు వీటిని కఫహరమగు కణాదిగణమని చెప్పెదరు. అనఁగా పిప్పల్యాదిగణపతితము లగు శబ్దము లని యర్థము.

ఈపిప్పల్యాదిగణము కఫమును పోఁగొట్టును. మఱియును, పీనస లేక పడిశెము, అరోచకము, వాతరోగము అనువానిని నశింపఁజేయును. జఠరాగ్నిని దీపింపఁజేయును, గుల్మము, శూలరోగము వీటిని మొదలంట నశింపఁజేయును. ఆమమును పక్వముజేయును. కటుకరోహిణి, చిత్రమూలము, వేపచెక్క, మ్రానిపసపు, అతివస, వస, చెంగల్వకోష్టు, కొడిసెపాలవిత్తులు, చాగవేళ్లు, చేదుపొట్ల, (పొట్లఆకులని కొందఱు) వీటితో కషాయమును సమభాగముగఁజేసి మిరియములచూర్ణమును తేనెను కలిపి త్రాగిన కఫజ్వరములు నశించును.

వేపచెక్క, శొంతి, తిప్పతీగె, దేవదారుచెక్క, కచ్చూరము, నేలవేము, పుష్కరమూలము రెండువిధములగు పిప్పళ్లు, అనఁగా పిప్పళ్లు, గజపిప్పళ్లు, పెద్దములక వీటిని కషాయమునందు వైచి కాచి కఫజ్వరములు గలవారిచేత త్రాగించుచుండవలయును. తెల్లవావిలిఆకుతోచేసిన క్వాథము కఫజ్వరమును ఎండింపఁజేయును. మఱి


¹ క్వాథః.