भारतकोश
चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

पृष्ठ 408, कुल 674 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 408

ఆంధ్రతాత్పర్యసహితము. 387

❧ కృష్ణాద్యమోదకము. ❧

శ్లో. కృష్ణాచిత్రకదస్తీనాం కర్ష మర్ధపలం పరం, వింశతి శ్చ హరీతక్యో గుడస్య తు పలద్వయం, మధునా మోదకం ఖాదేచ్ఛ్లీపదం హన్తి దుస్తరం. 23.

పిప్పళ్లు చిత్రమూలము దంతి ఇవి ఒక్కొక్క కాలు పలమును, కరక్కాయలు ఇరువదియును, బెల్లము రెండు పలములును చూర్ణము చేసి తేనెతో మాత్రలను కట్టి తినిన భయంకరములగు శ్లీపదములు నశించును.


❧ సౌరేశ్వరఘృతము. ❧

శ్లో. సురసాం దేవకాష్ఠం చ త్రికటు త్రిఫలే తథా, లవణాన్యథ సర్వాణి విడంగా న్యథ చిత్రకం. 24. చవికా పిప్పలీమూలం గుగ్గులు ర్హపుషా వచా, యవాగ్రజం చ పాఠా చ శఠ్యైలా వృద్ధదారుకం. 25. కల్కైశ్చ కార్షికై రేభి ర్ఘృతప్రస్థం విపాచయేత్, దశమూలీకషాయేణ ధాన్యాషారసద్రవేణ చ. 26. దధిమండసమాయుక్తం ప్రస్థం ప్రస్థం పృథక్పృథక్, పక్వం స్యాదుద్ధృతం కల్కా త్పిబే త్కర్షత్రయం హవిః. 27. శ్లీపదం కఫవాతోత్థం మాంసరక్తాశ్రితం చ యత్. మేదశ్ర్శితం చ పిత్తోత్థం హన్యా దేవ న సంశయః. 28. అపచీం గండమాలాం చ అస్త్రవృద్ధిం తథార్బుదం, నాశయే ద్గ్రహణీదోషం శ్వయథుం గుదజాని చ, పర మగ్నికరం హృద్యం కోష్ఠక్రిమివినాశనమ్, ఘృతం సౌరేశ్వరం నామ శ్లీపదం హన్తి సేవితం. 30. జీవకేన కృతం హ్యేత ద్రోగాణీకవినాశనమ్.

సురస దేవదారువు శొంతి మిరియములు పిప్పళ్లు త్రిఫలములు పంచలవణములు వాయువిడంగములు చిత్రమూలము చవ్యము మోడి గుగ్గిలము బోడతరము వస యవక్షారము అగరుశొంతి కచ్చూరము ఏలకులు వృద్ధదారకము వీటినొక్కొక్క తులము చొప్పున తీసికొని కల్కముచేసి ఇందు 16 పలముల నేతిని పక్వము చేయవలయును. దశమూలముల కషాయముతోను ధనియముల యూషరసముతోను దధిమండముతోను వేర్వేరుగా నొక్కొక్క ప్రస్థము చొప్పున నేతిని పక్వము చేసి మూడుతులములు త్రాగవలయును. కఫవాతశ్లీపదములను మాంసరక్తాశ్రితమగు శ్లీపదమును పిత్తపు శ్లీపదమును నశింపఁ జేయును. అపచి గండమాలంత్రవృద్ధి అర్బుదము గ్రహణీదోషము వాపులను ఇయ్యది పోగొట్టును. ఇయ్యది సౌరేశ్వరమను ఘృతము.