चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 433, कुल 674 में से
संदर्भ में पढ़ें412 చక్రదత్త — ౪౮. భగ్నాధికారము.
విద్రధేరివాచ్యాపి క్రియాశోణితజేఽప్యిదే, కషాయకల్క సర్పీంషి తైలం చూర్ణం రసక్రియాం. 10. శోధనే రోపణే చైవ వీక్ష్య వీక్ష్యావతారయేత్, అర్బుదం మాంసపాకం చ విద్రధిం తిలకాలకం. 11. ప్రత్యాఖ్యాయ ప్రకుర్వీత భిషక్తేషాం ప్రతిక్రియాం. 12.
నేయి త్రాగుటయును విరేచనము చేయించుటయును నెత్తుటిని వెడలించుటయును లఘ్వాహారమును ఇందు మిక్కిలి హితకరములు. ఆవాలు కషాయములతోచేర్చి సిద్ధము చేసిన తైలమును రుద్దిన గాయములందుంకురములు కలుగును. ఈచికిత్సనే అధిమంథమునకును చేయవలయును. ఈరెంటిటిలొ రక్తస్రావము అట్టిలాయందు రక్తస్రావము అయినపిమ్మట గ్రంధులకవలే చికిత్సను చేయవలయును. కుంభిక యందు రక్తమును వెడలింపవలయును. పక్వమైన కుంభికయందు గాయమును శోధించి త్రిఫలములు లోధ్ర వీటిలేపమును తైలమును రుద్దిన గాయములు అంకురించును. అలజీకి రక్తమును వెడలించిన పిమ్మట ఈచికిత్సనే చేయవలయును. గ్రథితమును స్నిగ్ధమును చేసి బుద్ధిమంతుఁడు నాడీస్వేదముతో స్వేదనఁ జేయింపవలయును. సుఖపూర్వకముగా వెచ్చని స్నిగ్ధమగు వాటితో నుపనాహము చేయింపవలయును. పెద్దపిడికలను చక్కగా ఛేదనచేసి బడిశముతో ఉద్ధరించి కషాయము కల్కము చూర్ణమునందు తేనెను కలిపి సేవింపవలయును. పిత్తవిసర్పియందు చెప్పినక్రమమే పృథ్వీ యందును హితకరము. త్వక్పాకము స్పర్శ హాని మృదితము వీట్లకు మాటిమాటికిని సేచన చేయవలయును. కొంచెము వెచ్చజేసిన ముత్తువుపులగపు తైలమును మధురపదార్థములతో నుపనాహము చేయవలయును. శతపోనకమునందు రసక్రియను చేయుట మంచిది. కషాయము కల్కము నేయి తైలము చూర్ణము రసక్రియ వీటిని చక్కగా పరీక్షించి శోధనమునందు నుపయోగింపవలయును. అర్బుదము మాంసపాకము విద్రధి తిలకాలకము వీటిని వదిలిపెట్టి తక్కినవానికి వైద్యుఁడు చికిత్స చేయఁబడును.
ఇట్లు చక్రదత్తయందు శూకదోషాధికార ప్రకరణము ముగిసెను.
౪౮. భగ్నాధికారము.
భగ్నమునకు సామాన్యోపాయములు.
శ్లో. ఆదౌ భగ్నం విదిత్వా తు సేచయే చ్ఛీతలాంబునా, పంకేనాలేపనం కార్యం బంధనం చ కుశాన్వితం. 1. సుశ్రుతోక్తం చ. భగ్నే