चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 440, कुल 674 में से
संदर्भ में पढ़ेंఆంధ్ర తాత్పర్యసహితము. 419
గాని మజ్జిగతోగానినూరి లేపనచేసినచో దద్రురోగములను కుష్ఠురోగములనుకూడ నశింపజేయును. మద్దిచెక్కరసముతో తింటెపుగింజలు కరక్కాయవీటిని నీటితోనూరి లేపనచేసినచో దద్రు రోగములనెడి ఏనుగులకియ్యది సింహప్రాయము కాగలదు.
-⁎ ప్రపున్నాడాదిఉద్వర్తనము. ⁎-
శ్లో. ప్రపున్నాడస్య బీజాని ధాత్రీసర్జరసస్నుహీ, సౌవీరపిష్టం దద్రూణాం మేత దుద్వర్తనం పరం. 21.
చక్రమర్ధకబీజాని కరంజం చ సమాంశకం, స్తోకం సుదర్శనామూలం దద్రుకుష్ఠవినాశనమ్. 22.
లేపనా ద్భక్షణాచ్చైవ తృణకం దద్రునాశనం, యూథీపున్నాగమూలం చ లేపా త్కాంజిక పేషితం. 23.
కాసమర్దకమూలం చ సౌవీరేణ చ పేషితమ్, దద్రూకీటిభకుష్ఠాని జయే దేతత్ప్రలేపనాత్. 24.
శిఖరిరసేనసుపిష్టం మూలకబీజం ప్రలేపత స్సిద్ధ్మ, క్షారేణ వా కదల్యా రజనీమిశ్రేణ నాశయతి. 25.
గంధపాషాణచూర్ణేన యవక్షారేణ పేషితమ్, సిద్ధ్మనాశం వ్రజ త్యాశు కటుతైలయుతేన వా. 26.
కాసమర్దకబీజాని మూలకానాం తథైవ చ, గంధపాషాణమిశ్రాణి సిద్ధ్మానాం పరమౌషధమ్. 27.
ధాత్రీరస సర్జరస స్నుపాక్వః సౌవీరపిష్టశ్చ తథాయుతశ్చ, భవ న్తిసిద్ధ్మాని యథా న భూయ స్తథైవ ముద్వర్తనకం కరోతి. 28.
తింటెపుగింజలను ఉసిరిక సర్జరసము జెముడుపాల- అను వీనిని గంజితో నూరి పట్టించిన దద్రువులకు హితము. మరియు తింటెపుగింజలను కానుగ వీటిని సమాన భాగములనుదెచ్చి కొంచెము సుదర్శనమూలమును చేర్చి నూరి లేపనచేసిన దద్రువులు నశించును. తృణకమును (సుగంధితృణమును) నూరి లేపనచేసినను లేక భక్షించినను దద్రువులు నశించును. నంద్యావర్తపుపూవులు పున్నాగమూలను వీటిగంజితో నూరి పూసినను, కాసమర్దకమూలమును సౌవీరలవణముతో నూరి పూసినను, ముల్లంగిగింజలను ఉత్తరేణురసముతో నూరి పూసినను, యవక్షారము అరటి పసపు వీటిని నూరి పూసినను, గంధపాషాణచూర్ణముతో యవక్షారమును నూరి పూసినను లేక కటుతైలముతో లేపనచేసినను సిద్ధ్మలన్నియును నశించును. చేదుపొట్లగింజలను ముల్లంగివిత్తులను గంధపాషాణముతో నూరిపూసినను సిద్ధ్మలు కుదురగల్గు. మరియును ఉసిరిక రసము మద్దిరసము అంటుప్ప వీనిని గంజితోనూరి ముద్దచేసి నలుగుపెట్టినను సిద్ధ్మలు నశించును.