भारतकोश
चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

पृष्ठ 445, कुल 674 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 445

424 చక్రదత్త — ౪౯. కుష్ఠాధికారము.

కుష్ఠహా కామచారిణః, విడంగత్రిఫలాకృష్ణా చూర్ణం లీఢం సమాక్షికమ్. 62. హన్తి కుష్ఠం క్రిమీ న్మేహ న్నాడీవ్రణభగందరాన్, ఇంద్రాశనం గవాదాయ ప్రశస్తేఽహని చోద్యతః. 63. తచ్చూర్ణం మధుసర్పిర్భ్యాం లిహేత్తీరభుగాశనః, హత్వా చ సర్వకుష్ఠాని జీవే ద్వర్షశతద్వయమ్. 64. యః ఖాదే దభయాశిష్టం ముంచామలకాని వా, స జయేత్సర్వకుష్ఠాని మాసా దూర్ధ్వం న సంశయః. 65. దహ్యమానా చ్చ్యుతః కుంభే మూలగే ఖదిరాద్రసః, సాజ్య ధాత్రీరసక్షౌద్రో హన్యాత్కుష్ఠం రసాయనమ్. 66.

తేనిచో బలమనుసారముగా తిప్పతీగె రసమును సేవించి జీర్ణించిన పిమ్మట నేతితో గాని గంజితో గాని కొలదిగా భుజింపవలయును. మిక్కిలియును దుర్గంధశరీరముగలవాఁడైనను దివ్యరూపము కలవాఁడగును. పటోలము కాచు నింబము త్రిఫలములు నల్లజీలకఱ్ఱ వేపపస పిటికసాయమును తిక్తమగు భోజనమును కుష్ఠులనుబోగొట్టును. వాయువిడంగములు త్రిఫలములు పిప్పళ్లు వీటిచూర్ణమును తేనెతో సేవించిన కుష్ఠువులు క్రిమిరోగములు ప్రమేహములు నాడీవ్రణములు భగందరము మున్నగునవి నశించును. మంచిదినమునందు పెళ్లగించి తెచ్చిన పాపర వేరును చూర్ణము చేసి తేనెను నేతిని కలపి పాలను నేతిని త్రాగునభ్యాసముగలవాడు సేవింపవలయును. ఇయ్యది అన్ని విధములగు కుష్ఠులను పోగొట్టి 200 ఏండ్లు జీవింపచేయును. కరక నింబములనుగాని మిరియములను సిరికనుగాని తినిన నొక నెలలో కుష్ఠములు తొలగిపోవును. ఈరసాయనము కుష్ఠును హరించును.

వయస్యాది లేపములు.

శ్లో. వయస్యేడగజా కుష్ఠ కృష్ణాభి ర్గుడికా కృతా, బస్తమూత్రేణ సంపిష్టా లేపా చ్ఛ్విత్రవినాశినీ. 67. పూతికార్కస్నుహీరేంద్రద్రుమాణాం, మూత్రే సిక్తాః పల్లవాః సౌమనాశ్చ, లేపా చ్ఛ్విత్రం ఘ్నన్తి దద్రువ్రణాఁ శ్చ, కుష్ఠా న్యర్యాంసి భగ్ననాడీవ్రణాం శ్చ. 68. గజచిత్రవ్యాఘ్రచర్త్మ మసీ తైలవిలేపనాత్, శ్విత్రం నాశం వ్రజే త్సద్యో వా పూతి కీటవిలేపనాత్. 69. కుడవోఽవల్గుజబీజా ద్ధరితాలాచ్చతుర్థభాగసంమిశ్రః, మూత్రేణ గవాం పిష్టః సవర్ణకరణః పరః శ్విత్రే. 70.

మధుకము తగిరిసె కోష్ఠు పిప్పళ్లు వీటితో సిద్ధము చేసి మూత్రమునందునూరి లేపనచేసినచో తెల్లకుష్ఠులు నశించును. నెమలిఅడుగుచెక్క జిల్లేడు జెముడు పుష్కర