चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 448, कुल 674 में से
संदर्भ में पढ़ेंఆంధ్రతాత్పర్యసహితము. 427
తుంగముస్తెలు దేవదారువు వీటిఅన్నిటియంత గుగ్గిలము వీటిని చూర్ణముచేసి నేతితోమాత్రలను గట్టి ప్రాతఃకాలపు భోజనసమయమునందు బలానుసారముగా భక్షింపవలయును. ఇది పదునెన్మిది విధములగు కుష్ఠులు కృమిరోగములు దుష్టవ్రణములు గ్రహణీదోషములను రాక్షసులను విష్ణువుబోలె ఇయ్యది నశింపజేయును.
తిలషట్పలఘృతము.
శ్లో. పంచభల్లాతకాంశ్ఛిత్త్వా సాధయేద్విధివజ్జలే, కషాయం తం పిబేచ్ఛీతం ఘృతేనాక్త్వాష్ఠతాలుకః. 90.
పంచవృద్ధ్యా పిబేద్యావ త్సప్తతిం హ్రాసయే త్తతః, జీర్ణేఽద్యా దోదనం శీతం ఘృతం క్షీరోపసంహితమ్. 91.
ఏత ద్రసాయనం మేధ్యం వలీపలితనాశనమ్, కుష్ఠార్శః క్రిమిదోషఘ్నం దుష్టశుక్రవినాశనమ్. 92.
తైలా భల్లాతకానాం చ పిబే న్మాసం యథాబలం, సర్వోపతాపనిర్ముక్తో జీవే ద్వర్ష శతం దృఢమ్. 93.
ప్రలేపోద్వర్తనస్నాన పానభోజనకర్మణి, శీలితం ఖాదిరం వారి సర్వత్వగ్దోషనాశనమ్. 94.
నింబం పటోలం దార్వీం దురాలభాం తిక్తకరోహిణీం త్రిఫలాం, కుర్యా దర్ధపలాంశా న్పర్వటకం త్రాయమాణాం చ. 95.
సలిలాఢకసిద్ధానాం రసేఽష్టభాగస్థితే క్షిపేత్త్వాత్తే, చందనకిరాతతిక్తక మాగధికా త్రాయమాణాం చ. 96.
ముస్తావత్సకబీజం కల్కీకృత మర్ధకర్షా న్భాగాన్, నవసర్పిషశ్చ షట్పల మేత త్సిద్ధం ఘృతం పేయమ్. 97.
కుష్ఠజ్వరగుల్మార్శో గ్రహణీపాండ్వామయ శ్వయథూంశ్, ఛాంతి పామావిసర్వపీడ కాన్కండుమాదగంధసిద్ధంచ. 98.
అయిదుజీడిగింజలను ముక్కలుచేసి నీటిలొ యథావిధిగా సాధించి కషాయముఁ జేసి త్రాగిన కుష్ఠువులు నశించును. ఇయ్యది వలీపలితమును కుష్ఠు మున్నగు వానిని పోగొట్టును. జీడితైలమును బలానుసారముగా నొకనెలరోజులు త్రాగినచో సమస్తములైనట్టి దుఃఖములు నశించి 300 ఏండ్లుబ్రతుకఁగలుగును.
నింబము పటోలము మ్రానిపసపు దురదగొండి కటుకరోహిణి త్రిఫలములు పిత్తపాపడ కలుక్రానుగ వీటినర్థతుల॥ చొ॥ తెచ్చి 64 ఫలములనీటిలొ వైచి కషాయము చేసి ఎన్మిదవ పాలు మిగిలియున్నప్పుడు వడియగట్టి పిమ్మట చందనము నేలవేము పిప్పళ్లు తుంగముస్తెలు వీటి నర్థతులముచొ॥ కల్కముచేసి 6 పలముల నేతినందు సిద్ధముచేసి త్రాగిన కుష్ఠువులు జ్వరములు గుల్మములు మొదలగునవి నశించును.