भारतकोश
चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

पृष्ठ 460, कुल 674 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 460

ఆంధ్ర తాత్పర్యసహితము. 439

ధం క్షౌద్రయుతం పిబేత్, నాశయే దమ్లపిత్తం చ అరుచిం చ వమిం తథా. 9.

అమ్లపిత్తమునకు వాంతులను చేయించి పిమ్మట మృదువుగా విరేచనముల నీయవలయును. చిరోద్భూతమగు దానియందు దోషాదులకంటె నెక్కుడుగా నాస్థాపనఁ జేయవలయును. దోషసంసర్గజములగు వానికి ఔషధమును ఆహారమును కల్పింపవలయును. ఊర్ధ్వగతమైన ఆమ్లపిత్తము వాంతులచేతను అధోగతమైన ఆమ్లపిత్తమును విరేచనములచేతను పోగొట్టవలయును. తిక్తములగు నాహారములను కల్పింపవలయును. పొట్టుతీసిన యవలు అడ్డసరము ఉసిరిక వీటికషాయములో లవంగపుపట్ట ఏలకులు జాపత్రి వీటిచూర్ణమును తేనెను వేసికొనిత్రాగి ముద్గయూషమును భుజించినచో ఆమ్లపిత్తము నశించును. అల్లము పటోలము వీటికషాయము పాచనము దీపనము నగును. పటోల శొంఠి ధనియములు వీటికషాయమును త్రాగినచో పాన శూల మున్నగునవి నశించును. పటోలము శొంఠి వారాహీ కంద వీటికషాయమును పిత్తకఫాధిక్యతయందును ఆమ్లపిత్తమునందును త్రాగిన శూల భ్రమ మున్నగునవి నశించును. యవలు పిప్పళ్లు పటోలము వీటికషాయములో తేనెను వైచికొని త్రాగిన ఆమ్లపిత్తము అరుచి మున్నగునవి నశించును.

వాసాదశాంగము.

శ్లో. వాసామృతాపర్వటకనింబభూనింబమార్కవైః, త్రిఫలాకులకైః క్వాథః సక్షౌద్ర శ్చామ్లనాశనః. 10.
ఫలత్రికం పటోలం చ తిక్తాక్వాథః సితాయుతః, పీతః క్లీతకమధ్వాక్తో జ్వరచ్ఛర్ద్యమ్లపిత్తజిత్. 11.
పథ్యాభృంగరజః చూర్ణం యుక్తం జీర్ణగుడేన తు, జయే దమ్లపిత్తజన్యాం ఛర్ది మన్నవిదాహజాం. 12.

అడ్డసరము తిప్పతీగె పిత్తపాపడ వేప నేలవేము గుంటకలగరాకు త్రిఫలములు పటోలము వీటికషాయములో తేనెను కలిపి త్రాగిన నామ్లపిత్తములు నశించును. త్రిఫలములు పటోలము కటుకరోహిణి వీటికషాయములో చక్కెర మధుకము తేనె వేసికొనిత్రాగినను అమ్లపిత్తములు జ్వరములు నశించును. కరక్కాయలు గుండకలగరచూర్ణమును ప్రాతబెల్లముతో తినిన పిత్తజమగు విదాహము ఛర్ది మున్నగునవి నశించును.

వాసాదిగుగ్గులు.

శ్లో. వాసానింబపటోలత్రిఫలాశనయానయోజితో జయతి, అధికకఫామ్లపిత్తం ప్రయోజితో గుగ్గులుః క్రమేణ, ఛిన్నాఖదిరయష్ట్యాహ్వ