भारतकोश
चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

पृष्ठ 509, कुल 674 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 509

488 చక్రదత్త—౫౬. ముఖరోగాధికారము.

దుర్గంధముగల చంద్రచెక్కను నూరుపలములు తెచ్చి ముక్కలు చేసి ఒక ద్రోణపు నీటితో కషాయమును కాచి నాలుగవపాలు వీసము మిగిలియుండగా ముప్పదిరెండుపలముల తైలమును కలిపి సన్నని సెగను పక్వము చేయవలయును. మంజిష్ఠము యష్టిమధుకము దుర్గంధపుచంద్రచెక్కను కాయఫలము లక్క మట్టివేళ్లు తుంగముస్తెలు చిన్నయేలకులు కర్పూరము అగురు పద్మాక్షము లవంగము కంకోలము జాపత్రి త్రిఫలములు పతంగము ఎఱ్ఱమట్టి లవంగపుపట్ట ఉసిరిక కాయలు వీటిని కాలుకాలుపల చొప్పున తీసికొని వచ్చి కల్కమును చేసి పైతైలము మరుగుచుండగా నందు వేయవలయును. ఇయ్యది అన్నివిధములగు దంతరోగములను పోగొట్టును. పరిశీరము దంతవిద్రధి మంచుకు పండ్లు పట్టికొనిపోవుట దంతహర్షము పుష్పిపన్ను దారణము పండ్లకదలిక దుర్మాంసము పెరుగుట మాంసము తినిపోవుట ముఖదౌర్గంధ్యము మున్నగు రోగములలో దీనిని వాడుట శ్రేష్ఠము.

లాక్షాదితైలము.

శ్లో. తైలం లాక్షారసం క్షీరం ఘృతప్రస్థం సమం పచేత్ . 165.
చతుర్గుణేరిమక్వాథే ద్రవ్యైశ్చపలసంమితైః, లోధ్రకట్ఫలమంజిష్ఠాపద్మకేసరపద్మకైః. 106.
చందనోత్పలయష్ట్యాహ్వైస్తైలంగండూషధారణం, దాలనందంతచాలంచ హనుమోక్షం కపాలికాం. 107.
శీతాదం పూతివక్త్రంచ హ్యరుచిం విరసాస్యతాం, హన్యా దాస్యగతా నేతాన్ కుర్యాద్దంతా నపి స్థిరాన్. 108.

తైలము లాక్షారసము పాలు వీటిని ప్రత్యేకముగా సేరు చొప్పున తెచ్చి ఇంతకు నాలుగు రెట్లు చంద్రకషాయమునందు పక్వమునుచేయవలయును. లొద్దగ కట్ఫలము మంజిష్ఠము కమలకింజల్కములు కేసరి పద్మాక్షము చందనము కమలము యష్టిమధుకము వీటి నొక్కొక్కపలము చొప్పునచేర్చి కషాయమునుచేసి పైదానియందు కలపవలయును. పిమ్మట నీతైలమును పక్వముచేయవలయును. దీనిని పుక్కిటనుంచుకొనిన దంతచలనము హనుమోక్షము కపాలిక శీతాదము పూతివక్త్రము అరుచి అసహ్యత మున్నగు రోగములు నశించును. పండ్లు గట్టిపడును.

వకుళాది తైలము.

శ్లో. వకుళస్య పలం లోధ్రం వజ్రవల్లీకురంటకం, చతురంగుళ బబ్బోలవాజి కర్ణేరిమాశనం. 109.
ఏషాంకషాయ కల్కాభ్యాం తైలం పక్వంముఖేధృతం, స్థైర్యంకరోతి చలతాందంతానాం ధావనేనచ. 110.