चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 510, कुल 674 में से
संदर्भ में पढ़ेंఆంధ్రతాత్పర్యసహితము. 489
పొగడ చెట్టుబెఱడు లొద్దుగ వజ్రవల్లి నోరింట ఆమ్ల వేతసము వకుళము రేల చెక్క చంద్రసారము అశ్వగంధి వీటిని కల్కమును కషాయమును చేసి అందు తైలమును కలిపి పక్వముచేయవలయును. పిమ్మట ఈ తైలము పుక్కిటనుంచి కొనవలయును. లేనిచో ముఖమును కడిగికొనుటకైన నుపయోగించుకొనవలయును. పండ్లు గట్టిపడును.
సహకారగుటికలు.
శ్లో. ఏలాలతాల వనికాఫల శీతకోష క్కోలద్వికాని ఖదిరస్య కృతే కషాయే, తుల్యాంశకానిదశ భాగమితే నిధాయ ప్రోద్భిన్నకైతకపుటే పుట వద్విధాయ. 111. ప్రాంశతుల్యశశినాభి తదేకసంఘంపిష్ట్వా నవేన సహకారరసేన హస్తౌ, లిప్త్వా యథాభిలషితాం గుడికాంవిదధ్యాత్, స్త్రీపుం సయోర్వదన సౌరభ బంధుభూతాం. 112.
ఏలకులు కస్తూరి నానీఫలము త్రిఫలములు కర్పూరము కోశఫలము కంకోలము వీటిని రెండుకట్లునుగా తెచ్చి అంతకు పదిరెట్లు చంద్రసారము కొనివచ్చి కషాయమునుచేసి ఈయౌషధుల కల్కమును కలిపి మొగలిదొప్పలలో పెట్టి పుటపాకము చేసి యథావిధిగా పక్వము గావింపవలయును. పిమ్మట ఈయౌషధులంత కర్పూరమును కస్తూరిని కలిపి వైద్యుఁడగువాఁడు తనచేతులతో మామిడిరసమును పూసికొని గుళికలను చేయవలయును. ఇవి పుక్కిటనుంచుకొనినచో దుర్గంధమును పోగొట్టి సుగంధమును కలిగించును.
స్వల్పఖదిరవటికా.
శ్లో. ఖదిరస్య తులాంసమ్యగ్జలద్రోణే విపాచయేత్, శేషేఽష్టభా గే తత్రైవ ప్రతివాపం ప్రదాపయేత్. 113. జాతీకర్పూరపూగాని కక్కోలకఫలాని చ, ఇత్యేషా గుడికా కార్యా ముఖ సౌభాగ్యవర్ధినీ. 114. దంతౌష్ఠముఖరోగేశు జిహ్వాతాల్వామయేషు చ.
నూరు పలముల చంద్రచెక్కను ద్రోణపు నీటిలోఁగాచి ఎనిమిదవపాలు నీరు మిగిలియుండునప్పుడు జాజికాయ కర్పూరము పోకచెక్కలు కంకోలము వీటిచూర్ణమునుపోసి పిమ్మట మాత్రలను కట్టియించుకొనవలెను. ఇయ్యుని ముఖమునకు కాంతినిచ్చి ముఖరోగములను దంతరోగములను ఓష్ఠరోగములను జిహ్వారోగములను తాలురోగములను నశింపచేయును.
62