भारतकोश
चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

पृष्ठ 511, कुल 674 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 511

490 चक्रदत्त—५६. मुखरोगाधिकारमु.

బృహత్ఖదిరవటికా (बृहत्खदिरवटिका)

श्लो. गायत्रीसारतुलयोरिमवल्कलानां सार्धं तुलायुगलमम्बुघटैश्चतुर्भिः ।
निष्क्वाथ्य पादमवशिष्टं सुवस्त्रपूतं भूयः पचेदथ शनैरमृदुपावकेन ॥ 115 ॥
तस्मिंश्च नत्यमुपगच्छति चूर्णमेषां श्लक्ष्णं क्षिपेच्च कवलग्रहभागिकानाम् ।
एलामृणालसितचन्दनचन्दनाम्बुश्यामातमालविकसाघनलोहयष्टीः ॥ 116 ॥
लज्जाफलत्रयरसाञ्जनधातकीभश्रीपुष्पगैरिककटंकटकट्फलानाम् ।
पद्माह्वयोध्रवटरोहयवासकानां मांसी निशा सुरभिवल्कलसंयुतानाम् ॥ 117 ॥
कक्कोलजातिफलकोषलवङ्गकानि चूर्णीकृतानि विदधीत पलोन्मितानि ।
शीतेऽवतार्य्य सुमनःसारचतुःपलं च क्षिप्त्वा कलायसदृशीर्वटिकाः प्रकुर्य्यात् ॥ 118 ॥
शुष्का मुखे विनिहिता विनिकारयन्ति रोगांस्तलोष्ठरसनाद्विजतालुजातान् ।
कुर्य्युर्मुखे सुरभितां पटुतां रुचिञ्च स्थैर्य्यं परं दशनगं रसनालघुत्वम् ॥ 119 ॥


[ఆంధ్ర తాత్పర్యము]

చంద్రచెక్కను నూరుపలములు తెచ్చి దుర్గంధపుచంద్రను 150 పలములును తెచ్చి వీటిని నాలుగుద్రోణముల నీళ్లలో వండి నాల్గవపాలు నీళ్లు మిగిలియున్నప్పుడు వాసెనగట్టి సన్నని మంటతో పక్వముచేసి గట్టిపడునప్పుడు ఏలకులు పుష్కరనాళము తెల్లచందనము రక్తచందనము కురువేళ్లు తెల్లతెగడ జాపత్రి మంజిష్ఠము తుంగముస్తెలు మందూరము యష్టిమధుకము లజ్జావంతి త్రిఫలములు రసాంజనము ధాతకీకుసుమము నాగకేసరములు లవంగములు గేరు మ్రానిపసపు కొడిసెపాలవిత్తనములు పద్మాక్షము లోధ్ర మట్టిఇగుళ్లు యవాస జటామాంసిపసపు పొగడచెక్క వీటినన్నిటిని ఒక్కొక్క పిడికిలిచొప్పున తీసికొని పొడిచేసి ఉడికెడి ఆరసములో పోయవలయును. కక్కోలము జాతిఫలము కోషఫలము లవంగము వీటినొక్కొక్కపలముచొప్పున చూర్ణమునునందుకలిపి దింపవలయును. చల్లారినపిమ్మట నాలుగుపలములకర్పూరమునుకలిపి నూగుబోస కాయంత వేసి మాత్రలుచేసి ఎండించి పుక్కిట నుంచికొనవలయును. మెడ పెదవి పండ్లునాలుక దవడలు మున్నగువానియందు పుట్టినరోగము లన్నియును నశించిపోవును. ముఖమునకు పరిమళమును గలిగించును. దంతములను గట్టిపరచును. నాలుకను తేలికగాఁ జేయును.

ఇట్లు చక్రదత్తయందు ముఖరోగాధికార ప్రకరణము ముగిసెను.