भारतकोश
चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

पृष्ठ 512, कुल 674 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 512

౫౬. కర్ణరోగాధికారము.


కర్ణరోగమునందు చేయందగు నుపాయములు.

శ్లో. కపిత్థ మాతులుంగామ్ల శృంగబేర రసై శ్శుభైః, సుఖోష్ణైః పూరయేత్కర్ణం కర్ణశూలోప శాంతయే. 1.

శృంగ బేరం చ మధు చ సైంధవం తైలమేవ చ, కటూష్ణం కర్ణయోర్దేయ మే తద్వావేదనా పహం. 2.

లశునార్ద్రక శిగ్రూణాం సురంగ్యామూలకస్య చ, కదల్యా స్స్వరస శ్శ్రేష్ఠః కదుష్ణః కర్ణపూరణే. 3.

సముద్ర ఫేన చూర్ణేన యుక్త్యా వాప్యవచూర్ణయేత్, ఆర్ద్రకసూర్యావర్తక శోభాంజన మూల మూలక స్వరసాః. 4.

మధు తైల సైంధవ యుతాః పృథగుష్ణాః కర్ణశూల హారాః, శోభాం జనక నిర్యాస స్తిల తైలేన సంయుతః. 5.

వ్యక్తోష్ణః పూరణేకర్ణే కర్ణశూలోపశాంతయే, అష్టానామపి మూత్రాణాం మూత్రేణా న్యతమేన చ. 6.

కోష్ణేన పూరయేత్కర్ణా కర్ణశూలోపశాంతయే, అశ్వత్థపత్ర ఖల్వంవా విధాయ బహు పత్రకమ్. 7.

తైలాక్త మంగారపూర్ణం విదధ్యా చ్ఛ్రవణోపరి, యత్తైలం చ్యవతే తస్మాత్ ఖల్వా దంగరతాపితాత్. 8.

తత్సాంద్రం శ్రవణస్రోత స్సద్యో గృహ్ణాతి వేదనాఁ, అర్కపత్ర పుటే దగ్ధ స్నుహీ పత్ర భవోరసః కదుష్ణం పూరణాదేవ కర్ణశూల నివారణః. 9.


వెలగ మాచికాయ వీటితోనైన గంజి నల్లపురసమును వెచ్చఁజేసి చెవిలో పోసిన చెవిపోటులు మానును. అల్లము తేనె సైంధవలవణము నూనె వీటిని కొంచెము వెచ్చఁజేసి చెవిలో పోసిన చెవిబాధలు తప్పిపోవును. లేనిచో ఉల్లిగడ్డ అల్లము మునగ ఆకు సురంగి ముల్లంగి అరటి వీటిరసమును వెచ్చజేసి యైనను పోయవలయును.

సముద్రఫేనపు పొడిని పోసినను పోటులు తగ్గును. అల్లము నీలి గుంటకలగరాకు మునగచెక్క వీటిరసముతో తేనెను సైంధవలవణమును కలిసి చెవికి పోసిన కర్ణశూల హరించును. మునగబంకను నువ్వుల నూనెలో వెచ్చఁజేసి చెవిలో పోసిన కర్ణశూల నశించును. గోమూత్రము మున్నగు నష్టమూత్రములలోను ఏదైనా నొకదానిచేత మూత్ర

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित) · पृष्ठ 512, कुल 674 में से · BharatKosha