चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 531, कुल 674 में से
संदर्भ में पढ़ेंఆంధ్రతాత్పర్యసహితము — 511
పసపు తుంగముస్తెలు త్రిఫలములు మ్రానిపసపు చక్కెర మధుకము వీటిని చనుబాలతో నూరి కంటిలో వేసికొనిన కంటికి దెబ్బ తగులుటవలనఁ గలుగుశూల లన్నియును తొలగును. లేనిచో మేకయొక్క నేతిని పాలను మధుకము కమలములు జీవకము వృషభమనుగంధద్రవ్యము వీటిని నూరి నేతిని పక్వము చేసి నేత్రములకు ప్రయోగించినచో, సమస్తములగు నేత్రాభిఘాతములును తొలగును.
❖ సైంధవాది ప్రయోగములు ❖
శ్లోకములు (సంస్కృత మూలము):
सैन्धवं दारु शुण्ठी च मातुलुङ्गीरसो घृतम् ।
स्तन्योदकाभ्यां कर्तव्यं शुष्कपाके तदञ्जनम् ॥ ६२ ॥वाताभिष्यन्दवच्चान्यद्वाते मारुतपर्यये ।
पूर्वभुक्तं हितం सर्पिः क्षीरं चाप्यथ भोजने ॥ ६३ ॥वृक्षादन्यां कपित्थे च पञ्चमूले महत्यपि ।
सक्षीरं कर्कटरसे सिद्धं चापि पिबेद् घृतम् ॥ ६४ ॥अभिष्यन्दमधिमन्थं रक्तोत्थमथ वार्जुनम् ।
शिरोत्पातं शिराहर्षमन्यांश्चाक्षिभवान् गदान् ॥ ६५ ॥स्निग्धस्याज्येन काम्भेण शिराव्यधैः शमं नयेत् ।
आम्लाध्युषितशान्त्यर्थं कुर्याल्लेपान् सुशीतलान् ॥ ६६ ॥त्रैङ्गुदं त्रैफलं सर्पिर्जीर्णं वा केवलं हितम् ।
शिराव्यधं विना कार्याः पित्तस्यन्दाहरो विधिः ॥ ६७ ॥सर्पिः क्षौद्राञ्जनं च स्याच्छिरोत्पातस्य भेषजम् ।
तद्वत्सैन्धवकासीसं स्तन्यपिष्टं च पूजितम् ॥ ६८ ॥शिराहर्षेऽञ्जनं कुर्यात्फाणितं मधुसंयुतम् ।
मधुना तार्क्ष्यशैलं वा कासीसं वा समाक्षिकम् ॥ ६९ ॥
ఆంధ్ర తాత్పర్యము:
సైంధవలవణము మ్రానిపసపు శొంఠి మాచిరసము నేయి వీటిని చనుబాలతోను నీటితోను నూరి శుష్కపాక నేత్రములకు వేయుట హితకరము. వాయుజములగు నభిష్యందరోగములయందును ఇతరరోగములయందును మొదట ఘృతమును తినిపించి పిమ్మట పాలను ద్రాగించుట హితము. బదనిక వెలగ బృహత్పంచమూలములు బిల్వపత్రము వీటితో వేరువేరుగా సిద్ధముచేయబడిన పాలతో కూడిన నేతిని త్రాగుట మంచిది. అభిష్యందము అధిమంథము నేత్రార్జునము శిరోత్పాతము శిరోహర్షము ఈరోగములు ఇతర నేత్ర రోగములను స్నిగ్ధము చేయించి నాడులను ఛేదించి పోగొట్టవలయును. ఆమ్లాధ్యుషితరోగమును పోగొట్టుటకై శీతలలేపములను చేయవ...