चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 583, कुल 674 में से
संदर्भ में पढ़ेंఆంధ్ర తాత్పర్యసహితము. 563
కలునశించును. గ్రద్దముక్కు కాకిసాలుంక పందిబొడ్డు కంచు పాదరసము విషము పర్వకాలపుకప్పయొక్క వామజంఘపు టెముక ఈరీతిగా ఒక్కొక్కదానిని గాని అన్నిటినికలిపి గాని కటియందు ధరించినచో అహిండికలునశించును. ఈవిధికి పథ్యమేమియును లేదు. అనామకరోగమునందు ఘర్ఘురికామాంసము మిరియములు వంశలోచనము నవనీతము వీటిని కలిపి తినిన మంచిది. నవనీతమును పిల్లనికి రాచి కుక్కచేతనాకించినచో అనామకరోగము నశించును.
—౦ తైలాభ్యంగాదులు. ౦—
శ్లో. తైలస్య భాగ మేకం మూత్రస్య ద్వౌ చ శింబీదలరసస్య, గవ్యం పయ శ్చతుర్గుణ మేవం పచే త్తైలం. 13. తే నాభ్యంగ స్సతతం రోగ మనామకాఖ్య మపహరతి, అర్కతూలక మావికరోమా ణ్యాదాయ కేశరాజస్య. 14. స్వరసేనాక్తే వస్త్రీకృత్యా వర్తిం చ తైలాక్తాం, తజ్జాతకజ్జలాంచితలోచనయుగలోఽప్యలఙ్కృతో బాలః. 15. కష్ట మనామకరరోగం క్షపయతి భూతాదికం చాపి, చాలనికాతలసంస్థిత పోతం సంప్లావ్య గవ్యమూత్రేణ. 16. బకోదశాలికాయాం రజకక్షారోదక స్నానం, దాసక్రయణ శ్రావణ వరాటికా రసేంద్రపూరితా ధృతా కంఠే, నలినీదలే చ శయనం సుకష్ట మనామకాఖ్యరోగఘ్నం. 17. భైషజ్యం పూర్వ ముద్దిష్టం నరాణాం య జ్జ్వరాదిషు, దేయం తదేవ బాలానాం మాత్రా తస్య కనీయసీ. 18 ప్రథమే మాసి జాతస్య శిశో ర్భేషజరక్తికా, అవలేహ్య తు కర్తవ్యా మధుక్షీరసితాఘృతైః 19. ఏకైకాం వర్ధయే త్తావ ద్యావ త్సంవత్సరో భవేత్, తదూర్ధ్వం మాషవృద్ధి స్స్యా ద్యావడాషోడశాబ్దికాః. 20.
నూనె 1 భాగము, గోమూత్రము 2 భాగములు, శింబీదలములరసము 2 భాగములు, ఆవుపాలు నాలుగురెట్లు వీటిలో తైలమును పక్వముచేసి దానిని తలంటుచుండిన అనామకరోగములు నశించును. జిల్లేడు దూది మేకఉన్నిని గుంటకలగరరసములో వస్త్రమును తడిపి పత్తినిచేసి తైలములో ముంచి కాల్చి ఆమసిని కాటుక వేసిన నసాధ్యములగు అనామకరోగములను నశించును. పడవనున్నగు వానిపై బాలకునుంచి గోమూత్రముతో స్నానము చేయించి ఏకాంతస్థానమునందు రుద్దవలయును. ఇవి యన్నియును కష్టరూపములగు ననామకములను పోగొట్టును. పెద్దలకు జ్వరాదులందే యౌషధములు మున్ను చెప్పఁబడినవో అవియే పిల్లలకు నియ్యఁదగినవి. అయితే, పుట్టినబిడ్డకు మొదటి