भारतकोश
चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

पृष्ठ 584, कुल 674 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 584

564 చక్రదత్త—౬౩. బాలరోగాధికారము.

నెలలో ఒక చిన్నమాత్రయంత, రెండవ నెలలో రెండుచిన్న మాత్రలంత ఇవ్విధంబున సంవత్సరమువరకు హెచ్చించుచు నౌషధమును తేనెలోగాని, పాలలోఁగాని చక్కెరలోఁగాని, నేతిలోఁగాని కలిపి నాకించవలయును. ఆవల సంవత్సరము మొదలు పదునాలుగుసంవత్సరము లగువఱకు నొక్కొక్క మినపగింజంత హెచ్చింపవలయును.

హరిద్రాదులు.

శ్లో. హరిద్రాద్వయయష్ట్యాహ్వనింబశాక్రయవైః కృతః, శిశోర్జ్వరాతిసారఘ్నః కషాయ స్తన్య దోషజిత్. 21.

పసపు మ్రానిపసపు మధుకము కొడిసెపాలవిత్తులు వీటికషాయము పిల్లల అతిసారరోగములను మాన్పును.

బాలచతుర్భద్రిక.

శ్లో. ఘనకృష్ణారుణా శృంగీ చూర్ణం క్షౌద్రేణ సంయుతం, శిశోర్జ్వరాతిసారఘ్నం కాసశ్వాసవమీహరం. 22,

తుంగముస్తలు పిప్పళ్లు శృంగి వీటిని చూర్ణముచేసి తేనెతోకలిపి పిల్లల కిచ్చిన జ్వరాతిసారములు దగ్గు శ్వాస వాంతులు నశించును.

ధాతక్యాదులు.

శ్లో. ధాతకీబిల్వధాన్యాక లోధ్రేంద్రయవవాలకైః, లేహః క్షౌద్రేణ బాలానాం జ్వరాతిసారవాంతిజిత్. 23. రజనీదారుశరలైః శ్రేయసీ బృహతీద్వయం, పృష్నిపర్ణీ శతాహ్వాచ లీఢం మాక్షికసర్పిషా. 24. గ్రహణీ దీపనం హన్తి మారుతార్తిం సకామలాం, జ్వరాతిసారపాండుఘ్నం బాలానాం సర్వశోధనుత్. 25. మిశీకృష్ణాఁజనం లాజా శృంగీ మరిచమాక్షికైః, లేహః శిశో ర్విధాతవ్య శ్ఛర్దికాసజ్వరాపహః. 26.

ధాతకీఫలము మాకుడు దానియములు లోధ్ర కొడిసెపాలవిత్తులు కురువేరు తేనె వీటిలేహను పిల్లలకు జ్వరాతిసారములను వాంతిని పోగొట్టును. పసపు దేవదారు కరక్కాయలు వాకుడు శతావరి వీటిని తేనెతో నేతితో కలిపి లేహమునుచేసి ఈయవలయును. గ్రహణి వాతరోగము కామెల అతిసారము మున్నగు వానిని పోగొట్టును. సోంపు పిప్పళ్లు సుర్మా పేలాలు మిరియములు తేనె వీటితోచేసిన లేహమును పిల్లకిచ్చిన వాంతిని మున్నగునవి నశించును.

శృంగ్యాదిలేహము.

శ్లో. శృంగీం సముస్తాతివిషాం విచూర్ణ్య లేహం విధధ్యా న్మధునా