भारतकोश
चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

पृष्ठ 586, कुल 674 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 586

566 చక్రదత్త — ౬౩. బాలరోగాధికారము.

బిల్వము ఆరెపువ్వులు కురువేరు లోధ్ర వినుగుపిప్పళ్లు వీటి కషాయములోను అవలేహమునందును తేనెను కలిపి అతిసారముగల బాలకుని కీయవలయును. మంజిష్ఠము ధాతకీకుసుమము లోధ్ర మనుబాల వీటి కషాయములో తేనెను కలిపి బాలకులకు భయంకరములగు నతిసారములలో నీయవలయును. శొంఠి అతివస తుంగముస్తలు కురువేరు కొడిసెపాల వీటికషాయమును ప్రాతఃకాలమునందే బాలకునిచేత త్రాగింపవలయును. అన్ని అతిసారములను నశింపఁజేయును. మంజిష్ఠ ధాతకీకుసుమము ఉసిరిక కమలము వీటినినూరి గంజిని కాచి ఇచ్చిన అన్ని అతిసారోరోగములను నశించును. మారేడు వేళ్లను కషాయముగాఁచి కండచక్కెర పేలాలు వీటిని కలిపి పిల్లలకు త్రాగించినచో ఛర్ధి అతిసారమును నశించును.

మోచరసాది యవాగుః.

శ్లో. మోచరస స్పృశంగా చ ధాతకీ పద్మ కేసరం, పిష్టై రేతై ర్యవాగూ స్స్యా ద్రక్తాతిసారనాశినీ. 39.
లేహ స్సైలసితాక్షౌద్ర తిలయష్ట్యాహ్వకల్కైః, బాలస్య రుంధ్యా న్నియతం రక్తస్రావం ప్రవాహికాం. 40.
లాజా సయష్టిమధుకం శర్కరాక్షౌద్ర మేవ చ, తండులోదకసంసిక్తం క్షిప్రం హంతి ప్రవాహికాం. 14.
అంకోటమూల మథవా తండులసలిలేన వటజమూలం వా, పీతం హంత్యతిసారం గ్రహణీరోగం సుదుర్వారం. 42.
సితజీరసర్జచూర్ణం బిల్వదలోత్థాంబుమిశ్రితం పీతం, హంత్యామరక్తశూలం గుడసహితః శ్వేతసర్జో వా. 43.
మరిచమపాషాఢకుటజం ద్విగుణీకృత ముత్తరోత్తరం క్రమశః, గుడతక్రయుక్త మేతద్ గ్రహణీరోగం నిహం త్యాశు. 44.
బిల్వాశ్మక్రాంజమోచాబ్దసిద్ధ మాజం పయః శిశోః, సామాంసరక్తాం గ్రహణీపీతం హన్యా త్త్రిరాత్రతః. 45.
తద్వదజాతీరసమో జంబూత్వ గుద్భవో రసః, గుదపాకేతు బాలానాం పిత్తఘ్నం కారయే త్క్రియాం. 46.
రసాంజనం విశేషేణ పానాలేపనయో ర్హితం.

బూరుగజిగురు మంజిష్ఠము ధాతకీకుసుమము కమలకేసరములు వీటినినూరి గంజి చేసి త్రాగించిన రక్తాతిసారములు నశించు. తైలము కండచక్కెర తేనె తిలలు మధుకము వీటికల్కము పిల్లలకుగల రక్తస్రావమును ప్రవాహికను పోగొట్టును. పేలాలు మధుకము కండచక్కెర వీటిని నీళ్లతోఁ ద్రావించినచో ప్రవాహికలు నశించును. అంకోటమూలమును గాని మఱ్ఱియూడనుగాని బియ్యపుకడుగుతో నూరి త్రావించిన అతిసారములు

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित) · पृष्ठ 586, कुल 674 में से · BharatKosha