भारतकोश
चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

पृष्ठ 589, कुल 674 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 589

ఆంధ్రతాత్పర్యసహితము. 569

.65.వర్తిః క్షౌద్రేణ సంయుక్తా బాలే సర్వాతిరోగనుత్, మాతుః స్తన్యం కటుస్నేహకాంచికై ర్భావితో జయేత్. 65. స్వేదా ద్ద్విపశిఖోత్థస్తో నేత్రామయ మలక్తకః, శుంఠీభృంగనిశాకల్కః పుటపాకః ససైంధవః. కుకూలకే౭క్షిరోగేశు భద్ర మాశ్చ్యోతనం హితం, క్రిమిఘ్నలశిలా దార్వీలాక్షా కాంచన గైరికైః. 67. చూర్ణాంజనం కుతూలే స్యాచ్ఛిశూ నాం పోథకీషు చ, సుదర్శనామూలచూర్ణా దంజనా స్యా త్కుకూల కే. 69. గృహధూమనిశాశుష్కవాజికేంద్రయవైః శిశోః, లేప స్తక్రేణ హన్త్యాశు సిద్ధ పద్మావిచర్చికాః. 69.

నెమలిచెంక్క యొక్క బూడిదలో నీళ్లను కలిపి త్రాగినను వటకష్టకమును ధరించినను తృషలు నశించును. మ్రానిపసపు తుంగముస్తెలు గైరికము వీటిని మేకపాలతోనూరి కన్నులకు పట్టువేసినచో నేత్రరోగములు నశించును. మణిశిల శంఖునాభి పిప్పళ్లు రసాంజనము తేనె వీటివత్తినుపయోగించిన నేత్రరోగములునశించును. లత్తుకరసము పాలు కటుతైలము గంజి వీటిలో తడిపివత్తిచేసి వెలిగించి కాచిన నేత్రరోగములు నశించును. వాయువిడంగము హరిదళము మణిశిల మ్రానిపసపులక్క విషబొద్ది వీటిచూర్ణమును పిల్లలకుకూ౯ రోగాదులను పోగొట్టును. సుదర్శనపు వేళ్లను కాటుక వేసిన కుకూలముకు మంచిది. బూజు పసపు శొంఠి చెన్నేరు కొడిసెపాల వీటిని మజ్జిగలో నూరి లేపన చేసిన సిద్ధ పద్మ విచర్చిక మున్నగు రోగములు నశించును.

అశ్వగంధ ఘృతము.

శ్లో. పాదకల్కేశ్వగంధాయాః క్షీరం దశగుణే పచేత్, ఘృతం పేయం కుమారాణాం పుష్టికృద్బలవర్ధనం. 69.

పెన్నేరుకల్కము పాలు పదిరెట్లును తీసికొని అందు నేతిని సిద్ధముచేసి త్రాగించిన పిల్లలకు బలము కలుగును.

బాలచాంగేరీ ఘృతము.

శ్లో. చాంగేరీస్వరసే సర్పిశ్ఛాగక్షీరసమే పచేత్, కపిత్థవ్యోష సింధూత్థ సమంగోత్పలబాలకైః. 71. సబిల్వధాతకీమోచైః సిద్ధం సర్వాతిసారనుత్, గ్రహణీం దుస్తరాం హంతి బాలానాం తు విశేషతః. 72.

చాంగేరీరసము మేకపాలు వీటిని సమభాగములను గ్రహించి అందు నేతిని, పక్వము చేసి వెలగ శొంఠి మిరియములు పిప్పళ్లు సైంధవలవణము మంజిష్ట తెల్లకమల

72