चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 626, कुल 674 में से
संदर्भ में पढ़ें606 చక్రదత్త—౬౫. రసాయనాధికారము.
ఈశివాగుటికయనురసాయనమును ఈశ్వరుఁడుగణపతికి చెప్పెను. శివునివలన నుక్తమయ్యె నుకావున నిది శివాగుటిక యనఁబడెను. ఇయ్యదిశైవసిద్ధాంతమునందు చెప్పఁబడియెను.
—౩ అమృతభల్లాతకి. ౩—
శ్లో. సుపక్వభల్లాతఫలాని సమ్యగ్ద్విధా విదా ర్యాఢకసమ్మి తాని. 192. విపాచ్య తోయేన చతుర్గుణేన చతుర్థశేషే వ్యపనీయ తాని, పునః పచే త్క్షీరచతుర్గుణేన ఘృతాంశయుక్తేన ఘనం యథా స్యాత్. 193. శీతోపలాషోడశభిః పలై స్తు విమిశ్ర సంస్థాప్య దినాని సప్త, తతః ప్రయోజ్యాగ్నిబలేన మాత్రాం జయే ద్గుదోత్థా నఖిలాం స్వికారాన్. 194, కచాం స్సుశీలా నసకుంచితాగ్రాన్ సువర్ణపుష్టిం సుకు మారతాం చ, జవం హయానాం చ మతంగజం బలం స్వరం మయూ రస్య హుతాశదీప్తిం. 195. స్త్రీవల్లభత్వం లభతే ప్రజాం చ నీరోగ మబ్దద్విశతాని చాయుః, న చాన్నపానే పరిహార్య మస్తి నచాతపే చాధ్వని మైథునే చ. 196. ప్రయోగకాలే సకలామయానాం రాజా హ్వయం సర్వరసాయనానాం. భల్లాతకశుద్ధిరిహ ప్రాగిష్టచూర్ణగుండ నాత్, ఘృతా చ్చతుర్గుణం క్షీరం ఘృతస్య ప్రస్థ ఇష్యతే. 197.
చక్కగా పక్వములైన జీడివిత్తనములను రెండుగాచీల్చి ఒకఆఢకమును నాలుగు రెట్లనీటిలో పక్వముచేసి నాల్గవపాలు మిగిలియుండగా దించి నాల్గురెట్లు పాలను కలిపి మరల పక్వము చేయవలయును. ఇట్లు గట్టిపడునంతవరకును చేసి పిమ్మట 16 పల ముల చక్కెరను కలిపి ఏడురోజు లుంచవలయును. పిమ్మట అగ్ని బలానుసారము గ మాత్రల నుపయోగింపవలయును. ఇయ్యది గుదరోగములను సంపూర్ణముగా పోగొ ట్టును, వెంట్రుకలను నల్లగను సన్నని యగ్రములు గల వానిగను చేయును, గరుడునిలా గంటిచూపును సుకుమారతను ఇచ్చును. గుఱ్ఱమువంటి వేగమును ఏనుగుల వంటిబల మును నెమలివంటి స్వరమును అగ్నివంటి తేజమును స్త్రీవల్లభత్వమును మంచి సంతా నము నిచ్చి నీరోగముగా రెండునూళ్ల యేండ్లయాయువు నొసగును. అన్నపానములలో పరిహరింపదగిన దేదియును లేదు. ఎండ, దారి, మైథునములు పరిహరింపనవసరము లేదు. ప్రయోగకాలమునందు అన్నిరోగములకును స్వేచ్ఛగా దీనిని వాడవచ్చును. సమస్తరసా యనములలో నిది శ్రేష్ఠమైనది. జీడివిత్తులను శుద్ధిచేయుటలో పూర్వము చెప్పినచొప్పు న వాంఛితమగు చూర్ణగుండనముతో చేయవలయును. నేతికంటె నాలుగురెట్లపాలను 16 పలముల నేతిని గ్రహింపవలయును.
ఇట్లు చక్రదత్తయందు రసాయనాధికార ప్రకరణము ముగిసెను.