भारतकोश
चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

पृष्ठ 664, कुल 674 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 664

ఆంధ్ర తాత్పర్యసహితము. 645

మర్మహీనములు సమీపప్రదేశము నందున్నవియగు నాడులను ఛేదింప వలయును. పదిఆరు సంవత్సరములకు తక్కువగాని, డెబ్బది ఏండ్లకు మించిన, రక్తస్రావ రోగులకును గర్భిణీస్త్రీలు మున్నగువానికి నాఁడును ఛేదింపరాదు. ఇట్లైన ప్రసన్నవర్ణము ప్రసన్నేంద్రియములును ఇంద్రియార్థములను కోరుచున్నవాఁడై పురుషుఁడు సుఖాన్వితుఁడై బలము కలిగియుండునని యందురు.

ఇట్లు చక్రదత్తయందు శిరావ్యధాధికార ప్రకరణము ముగిసెను.


౭౫. సుస్థాధికారము.

దినచారవిధులు.

శ్లో. బ్రాహ్మే ముహూర్తే ఽఉత్తిష్ఠే త్సుస్థో రక్షార్థ మాయుషః, శరీరచింతాం నిర్వర్త్య కృతశౌచవిధిః తతః. 1.
ప్రాత ర్భుక్త్వా చ మృద్వగ్రం కషాయకటుతిక్తకం, భక్షయే ద్దంతపవనం దంతమాంసాన్య బాధయన్. 2.
నాద్యాదజీర్ణవమథుశ్వాసకాసజ్వరార్దితః, తృష్ణాస్యపాకహృన్నేత్రశిరఃకర్ణామయీ చ తత్. 3.
సౌవీర మంజనం నిత్యం హిత మక్షోః ప్రయోజయేత్, సప్తరాత్రేష్వరాత్రే వా స్రావణార్థం రసాంజనం. 4.
తతో నావనగండూషధూమతాంబూలభాగ్భవేత్, తాంబూలం క్షతపిత్తాస్రరూక్షోత్కుపితచక్షుషాం. 5.
విషమూర్ఛామదార్తానాం న పథ్యం చాపి శోషిణాం.

బ్రాహ్మముహూర్తములో లేచి ఆయుష్యరక్షణమునకై శరీరచింతనమునుచేసి శౌచములను తీర్చికొన వలయును. ప్రొద్దుట కోమలమును కషాయ కటుతిక్తములు గలదియునగు నాహారమును భుజించి పండ్లచిగుళ్లకు నొప్పి లేకుండ తాంబూలమును సేవింపవలయును. అజీర్ణము ఛర్ది శ్వాసకాసములు జ్వరము దాహము ముఖపాకము హృద్రోగము నేత్రరోగము శిరోరోగము కర్ణరోగము కలవారు దీనినిభక్షింపరాదు. సౌవీరాంజనమును ప్రతినిత్యమును కంటికిపెట్టుకొనవలయును. ఏడు రోజులకుగాని ఎన్మిది రోజులకుగాని మలము పోవుటకై రసాంజనమును సేవింప వలయును. పిమ్మట తాంబూలము నస్యము మున్నగువానిని వేసికొనవచ్చును. క్షయ పిత్తరక్తము రూక్ష ఉత్కుపిత నేత్రరోగం అనగా కంటి జబ్బులుగల వారు మాత్రము తాంబూలమును నమలరాదు.