चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 666, कुल 674 में से
संदर्भ में पढ़ें| ఆంధ్రతాత్పర్యసహితము. | 647 |
|---|
కాలేహితం మితం బ్రూయాదవిసంవాదిపేశలం. 15. ఆత్మవత్సతతం పశ్యే-
దపి కీటపిపీలికాం, ఆత్మనః ప్రతికూలాని పరేషాం న సమాచరేత్. 16.
నక్తం దినానిమేయాంతి కథంభూతస్య సంప్రతి, దుఃఖభాజ్నభవేత్యే-
వం నిత్యంసన్నిహితస్మృతిః. 17.
గొడుగు చెప్పులు ధరించికొని పరికించుచు నడువవలయును. రాత్రులెద్దియైన నావశ్యకమగు కార్యముగలిగెనేని కఱ్ఱనుధరించి మానియై సహాయుని తీసికొని బయలువెడలవలయును. జీర్ణమగుచుండినచో హితముగను మితముగను భుజింపవలయును. త్వరపడరాదు. బలముకొలదివేగము నణపరాదు. సాధ్యమగు రోగమును పోగొట్టుకొనక అన్యకార్యమునకై వేగిరపడకూడదు. శరీరము వాఙ్మనస్సు వీటితో పదివిధములగు పాపకార్యములను త్యజింపవలెను. సమయమునందు హితముగను ప్రమాణముగను భుజింపవలయును. ఎవ్వరితోను విసంవాదముగా వరుసనాడరాదు. తనవలెనే అందఱను చూచికొనవలయును. కీటముల నైనను పిపీలికముల నైన నిట్టులే చూడవలయును. తనక ప్రతికూలములగ వానిని ఇతరుల కెవ్వరికిగాని చేయరాదు. నాకు ఇప్పటిరీతులన రాత్రిందివములు గడచుచున్నవి అని సన్నిహితస్మృతియై దుఃఖింపరాదు.
ఋతుచర్య.
శ్లో. మాసైర్ద్విసంఖ్యైర్మాఘాద్యైః క్రమాత్ షడృతవః స్మృతాః,
బలినః శీతసంరోధాద్ధేమంతే ప్రభలోఽనలః. 18.
సేవేతాతో హిమే స్నిగ్ధస్వాద్వమ్లలవణాన్ రసాన్,
గోధూమపిష్టమాంసేక్షుక్షీరోత్థవికృతిః సురాః. 19.
నవముష్ణం వసాం తైలం శౌచకార్యే సుఖోదకం,
యుక్త్యార్కకిరణాన్స్వేదం పాదత్రాణం చ సర్వదా. 20.
ప్రావారాజినకౌశేయప్రవేణీకుథకాస్తృతం,
ఉష్ణస్వభావై ర్లఘుభిః ప్రావృతః శయనం భజేత్. 21.
అంగారతాపసంతప్తగర్భభూవేశ్మని ప్రియాం,
పీవరోరు స్తనశ్రోణీమాలింగ్యగురుచర్చితాం. 22.
అయమేవ విధిః కార్యః శిశిరేఽపి విశేషతః,
తదాహి శీతమాధిక్యం రౌక్ష్యం చాదనకాలజం. 23.
కఫశ్చితోహి శిశిరే వసంతేఽర్కాంకుతాపితః,
హత్వాగ్నింకురుతే రోగాంస్తస్తత్ర ప్రయోజయేత్. 24.
తీక్షం వమననస్యాది కవలగ్రహమంజనం,
వ్యాయామోద్వర్తనం ధూమం శౌచకార్యే సుఖోదకం. 25.
స్నాతోనులిప్తః కర్పూరచందనాగురుకుంకుమైః,
పురాణయవగోధూమక్షౌద్రజాంగలశూల్యభుక్,
ప్రపిబేదాసవారిష్టసీధుమాధ్వీకమాధవాన్. 26.