चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 86, कुल 674 में से
संदर्भ में पढ़ें66 చక్రదత్త—3. అతిసారాధికారము.
కొడిసెపట్ట, అతివస, మారేడువేరు, కురువేరు, తుంగముస్తలు వీటితోటి చేయఁబడిన కషాయము ఆమాతిసారములను, నొప్పిగలిగిన యతిసారరోగములను, రక్తాతిసారములను, మఱియును, చాలరోజులనుండి పుట్టిన యతిసారరోగములను నాశనము చేసి హితమును కలుగఁజేయును.
లేఁతదానిమ్మ బెరడు, కొడిసెపట్ట వీటితో పెట్టినకషాయములో తేనెను కలిపికొని త్రాగినయెడల రక్తాతిసారములు దూరముగా తొలఁగిపోవును. బెల్లముతో కలిసి మారేడుపండ్లను తినినట్టులయిన రక్తాతిసారములు నశించిపోవును. మఱియును ఆమశూలయు మలబద్ధకము మొదలగునవియుఁగూడ దూరముగా తొలఁగిపోవును. కడుపునొప్పి మొదలగునట్టి రోగములనుకూడను మొదలంట నశించి పోఁగలవు.
మారేడుపిందెలు, తుంగముస్తలు, ఆరెచెక్క, అతిరుశొంతి, శొంతి, బూరుగవేరు వీటి నన్నింటిని సమానములైన భాగములునుగా తీసికొని బెల్లముతో కలిపి మజ్జిగతో త్రాగినట్టులయిన నత్యంతము భయంకరము లగు నతిసారములును దూరము లగును. బూరుగువేరు, రేగువేరు, మొదటవేరు, మామిడివేరు, మద్దివేరు వీటిని వేరు వేరుగా తీసికొని మేకపాలును తేనెను చేర్చికొని త్రాగినయెడల రక్తాతిసారమును పోఁగొట్టును.
నేరేడు, ఉసిరిక, మామిడి వీటిచిగుళ్ల రసమును మేకపాలలో కలిపి తేనె చేర్చి త్రాగినయెడల రక్తాతిసారములు నశించిపోవును. మేకపాలలో మారేడుపిందెలు సిద్ధముచేసి (అనఁగా ననవైచి) చక్కెర మిరియపుపొడిని కలిపి ఆపిమ్మట నందు కొడిశెపాలవిత్తుల చూర్ణమును వేసికొని త్రాగినయెడల రక్తాతిసారము లణఁగిపోవును.
అతిమధురమును నూరి చక్కెర తేనెల నందులో కలిపి బియ్యపుకడుగుతో చేర్చికొని త్రాగినట్టులయిన గాని శతావరి [అనఁగా పెద్దపిల్లి పీచర] యొక్క కల్కమును పాలతో చేర్చి త్రాగినయెడల గాని మనుష్యుఁడు రక్తాతిసారమును జయింపగలుగును. లేకపోయిన శతావరిని కల్కముగాచేసి సిద్ధముచేయఁబడిన నేతిని రక్తాతిసారరోగముగల రోగి త్రాగినయెడల సుఖము కలుగును.
—• కుటజరసాయనము; గుద భ్రంశములకు కషాయము; కుటజపుటపాకము. •—
శ్లో. కుటజస్య పలం గ్రాహ్య మష్టభాగజలే శృతమ్, తద్ద్రవ వివచేద్భూయో దాడిమోదకసంయుతమ్. 72. యావచ్చైవ లసీకాభం శృతం త ముపకల్పయేత్, తత్స్వార్థకరం తక్రేణ పిబే ద్రక్తాతిసారవాన్. 73. అవశ్యమరణీయోపి మృత్యో ర్యాతి న గోచరమ్, క్వాథతుల్యం దాడిమాంబు భాగారుక్తా సమంతతః. 74. కల్క స్తీలానాం