चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 87, कुल 674 में से
संदर्भ में पढ़ें67 ఆంధ్ర తాత్పర్యసహితము.
సంస్కృత శ్లోకములు (Devanagari)
कृष्णास्नां शर्कराभागसंयुतः, आज्येन पयसा पीतः सद्यो रक्तं नियच्छति। ७५।
गुददाहे प्रपाके वा पटोलमधुकाम्बुना, सेकादिकं प्रशंसन्ति छागेन पयसापि वा। ७६।
गुदभ्रंशे प्रकर्तव्या चिकित्सा तत्प्रकीर्तिता, अवेदनं सुसम्पक्वं दीप्ताग्नेस्सुचिरोत्थितम्। ७७।
नानावर्णमतीसारं पुटपाकैरुपाचरेत्।
स्निग्धं घनं कुटजवल्क मजन्तु जग्धमादाय तत्क्षणा मतीवच पोथयित्वा, जम्बूपलाशपुट तण्डुलोयसिक्तं बद्धं कुशेन च बहिर्घनपङ्कलिप्तम्। ७८।
सुस्विन्न मेत दवपीड्य रसं गृहीत्वा क्षौद्रेणयुक्त मतिसारवते प्रदद्यात्, कृस्नात्रेपुत्रमतपूजित एष योगः सर्वातिसारहरणे स्वयमेव राजा। ७९।
स्वरसस्य गुरुत्वेन पुटपाकपलं पिबेत्, पुटपाकस्य पाकोऽयं बहि रा रक्तवर्णता। ८०।
ఆంధ్ర తాత్పర్యము
ఒక పలము కొడిసెపట్లను తీసికొని ఎనిమిదిరె ట్లధికముగా నున్న నీటిలోవైచి పాకము చేయవలయును. మఱల నదేప్రకారము దానిమ్మపండ్లరసమును కలిపి ఉడుకఁబెట్టవలయును. బాగుగా నుడికి తీగెమోస్తరుగా నుండినయప్పుడు దింపి జాగ్రత్త చేసికొని అర్ధకర్ష ప్రమాణముగా మజ్జిగతో కలిపి త్రాగుచుండినయెడల రక్తాతిసారములఁ నశించిపోవును. దీని సామర్థ్యమువలన చావునకు సిద్ధమైన మనుష్యుఁడుకూడను బ్రదక గలఁడు, కషాయముతో సమానముగా దానిమ్మరసమును తీసికొనవలయును.
నల్లనూవులను కల్కముచేసి దానికి సమభాగముగ కలకండను కలిపి మేకపాలతో కలిపి త్రాగినయెడల రక్తాతిసారము లన్నియు నతిశీఘ్రముగా నశించి పోఁగలవు. గుద్ది యెండిపోవునప్పుడుగాని, తీపు ఎత్తుచున్నప్పుడుగాని చేదుపొట్ల యష్టిమధుకము మొదలగువానితో చేయఁబడిన కషాయముతో తడుపుచుండుట చాల శ్రేయమును కలిగించును. లేకపోయినచో మేకపాలతో తడుపుటయైనను ఉత్తమమే యగును. గుద దిగినప్పు డీచికిత్సను చేయవలయును.
అగ్నిదీప్తిగలవానికిని, కష్టములు లేనివానికిని పరిపక్వమై చాలకాలముక్రిందటనే పుట్టి నానావిధములుగా నుండు అతిసారములకు పుటపాకముచేత చికిత్సను చేయవలయును. దట్టముగాను పురుగులు మున్నగువానిచే కొఱకబడకయు యుండినదియును, తగలబడనిదియు నగు కొడిసెపట్లను తీసికొనివచ్చి నూరి నేరేడుఆకులలో