मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)
Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary
कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा
पृष्ठ 102, कुल 167 में से
संदर्भ में पढ़ेंముకుందమాల 95 ఔషధమే, ఆత్యంతికమ్ = మిక్కిలి యధికమైన, నిర్వాణం = ఆనందమును (మోక్షమును) వితనుతే = కలుగ జేయుచున్నది. ఓ జనులారా! జనన మరణ వ్యాధి కొక చికిత్స చెప్పెదను వినుడు. దానిని యాజ్ఞవల్క్యాదులైన మునులు చెప్పియున్నారు. అంతర్జ్యోతి స్వరూపంబును, అప్రమేయమును, ముఖ్యమునగు శ్రీకృష్ణుడను పేరుగల యమృతమును ఆస్వాదింపుడు. ఆ పరమౌషధము అత్యంత సౌఖ్యమును గలుగజేయును. కులశేఖరాళ్వారులు కౌస్తుభాంశ సంభూతులు. వారికి జ్ఞానభక్త్యాదులు లేకపోలేదు. న మే పార్థా౬స్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన, నానవాప్త మవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. -- గీత. 3.22 శ్రేష్ఠుడగు వాని మార్గమునే ఇతరులు అనుసరింతురుగాన తానా చరించి యితరులు ఆచరించునట్లు చేయదలంచిరి. బలాత్కరించినను భగవద్విషయమున సంబంధపడని జనులు సూక్ష్మముగ దెలిపిన తెలిసికొం దురా? తమ మార్గము ననుసరింపకుండు జనుల నుద్దేశించి కులశేఖరు లీ రీతి హితోపదేశము చేసిరి. కులశేఖరులు: ఓ ప్రాణులారా! వినుడు (జాగరూకులై గమనింపుడు). నేనొక మందును చెప్పెదను. (సాధారణముగ లోకులు వైద్యము నందును, జ్యోతిషమునందును గురుత్వము గలిగి యుందురు. పైరెంటియందొక్క దానిని శరీర సుఖమునకు, మతొక్కదానిని సుఖదుఃఖానుభవము తెలి సికొనుటకును కోరుదురు. కులశేఖరులు ఔషధమును తెలియపరచెద ననగానే జనులు ఆశచెంది యిట్లనిరి.) జనులు : మీరే వ్యాధికి ఔషధము చెప్పబోవుచున్నారు? కులశేఖరులు: జననమరణము లను ఘోరవ్యాధికి మందుచెప్పెదను. సాధారణముగ నన్ని వ్యాధులకును ఔషధము లుంచు