मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)
Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary
कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा
पृष्ठ 103, कुल 167 में से
संदर्भ में पढ़ें96 ముకుందమాల కొని యుందురుగాని, యీ వ్యాధికి మాత్రము దొరకదు. రావణ హిరణ్యకశ్యపులు గూడ బ్రహ్మను యాచించి ఆ యౌషధమును బడయలేక పోయిరి. జనులు : ఆహా! అట్టి యౌషధము లభించుపక్షమున బహుసంతో షము. దానిని కనిపెట్టిన వైద్యుని పేరును వినిన యెడల మందు యొక్క యోగ్యత బాగుగ విశద మగును. తృప్తియగును. కుల : యోగనిష్ఠులైన యాజ్ఞవల్క్యాది మునులు దానిని కనిపె ట్టిరి. జనులు : ఆ యౌషధమునందు గురుత్వము కలిగినది. అది గొప్ప వ్యాధిని కుదుర్చు మందే. మఱి అదెక్కడ దొరకును? కుల : ఎక్కడికిని పోనక్కరలేదు. మనసులోనే యున్నది. జనులు : లోపల చీకటిగా నున్నదే. కుల : ఇతరౌషధములను వెదకి తెచ్చుటకు దీపముండవలెను. ఈ మందు స్వతః ప్రకాశము గలది. కావలయునని తల చిన యెడల జ్యోతి రూపమున నుండు ఆ లోపలిమందే అన్యదీపసహాయము లేకయే కనబడును. జనులు : దాని వెల యెంత? కుల : వెల లేదు. దానికి ఇంతయని ధరలేదు. జనులు : ఔషధసేవ చేయనారంభించినవాడు ఒకటివెనుక నొకటిగ వివిధములైన మందులను పుచ్చుకొనవలసియుండును. అందుచేత శ్రమ కలుగును. ధనవ్యయ మగును. అట్లే యీ యౌషధము పట్టక పోయిన యెడల మార్చవలసి యుండునా?