मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)
Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary
कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा
पृष्ठ 139, कुल 167 में से
संदर्भ में पढ़ें132 ముకుందమాల కుండ, పతతి=భూమిపై పడిపోవుచున్నది. మూఢ=జ్ఞానము లేనివాడా, దుర్మతే=దుష్టబుద్ధిగలవాడా, ఔషధైః=మందులచేత, కిం=ఏల, క్లిశ్యసి=కష్ట పడుచున్నావు? నిరామయం=ఆరోగ్యకరమైన, కృష్ణ రసాయనం=శ్రీకృష్ణు డను రసాయనమును, పిబ=పానముచేయుము. కీలుకీలూడి ముదిసిన ఈ శరీరము అవశ్యము క్షీణించును. ఓ మూఢుడా! ఓ దుర్మతీ! ఔషధములను మ్రింగి ఏల శ్రమపడుచున్నావు? వ్యాధిని పోగొట్టునదియైన శ్రీకృష్ణు డను రసాయనమును పానము చేయుము. ప్రశ్న : సదా భగవంతుని స్మరించుచు కూర్చుండిన నెట్లు? శరీ రము చెడును గదా! ఉత్తరము : భగవంతుని నామము లుచ్చరింపక వానిని దలపక కూర్చుండిన మాత్రమున శరీరమటులే యుండునా? ఎంత మాత్రముండదు. ముదిమి వచ్చును. ప్రశ్న : అటు పిమ్మట నే మగును? ఉత్తరము : సంధిబంధముల బిగువు సడలును. కీలుకీలు ఊడనా రంభించును. ఒక పదార్థము క్రిందబడి విరిగిపోయి చెదరిపోయెనేని ఉపయోగించదు. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత, అవ్యక్తనిధనా న్యేవ తత్ర కా పరిదేవనా. గీత. 2అధ్యా. 28శ్లోకమువలె శరీరమందు గల పంచభూతములు పోవును. అందుచేత కార్యము జరుగదు. కనుక మూఢా! (మూఢుడ నగా బుద్ధిలేనివాడు. తెలియదగిన దానిని తెలిసికొనకుండుట మౌఢ్యము. శరీరముండు రీతిని తెలిసికొనకుండుట చేత మూఢు డగుచున్నాడు.) ఓ దుర్మతీ! (అనగా దుష్ట బుద్ధిగలవాడు. మూఢుడుగ నుండుట కంటె