मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)
Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary
कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा
पृष्ठ 143, कुल 167 में से
संदर्भ में पढ़ें136 ముకుందమాల జగత్త్రయగురుః = మూడులోకములను బాలించునట్టి, కృష్ణః = శ్రీ కృష్ణుడు, నః = మనలను, రక్షతు = కాపాడునుగాక, అహం = నేను, కృష్ణం = శ్రీకృష్ణమూర్తిని, నమస్యామి = నమస్కరించుచున్నాను. కృష్ణేన = శ్రీ కృష్ణు నిచేత, అమరశత్రవః = దేవతా విరోధులైన రాక్షసులు, వినిహతాః = చంప బడిరి, కృష్ణాయ తస్మై = ఆ శ్రీకృష్ణుని కొఱకు, నమః = నమస్కారము, కృష్ణాదేవ = శ్రీకృష్ణుని వలననే, ఇదం జగత్ = ఈ లోకమంతయు, సము త్థితం = పుట్టినది. అహం = నేను, కృష్ణస్య = శ్రీకృష్ణునికి, దాసః = సేవకుడను, అస్మి = అగుచున్నాను. కృష్ణే = శ్రీకృష్ణునియందు, సర్వం ఏతత్ = ఈ ప్రపంచ మంతయు, అఖిలం = నశింపకుండ, తిష్ఠతి = ఉన్నది; హే కృష్ణ = ఓ శ్రీకృష్ణా!, మాం = నీ సొత్తయిన నన్ను, రక్షస్వ = కాపాడుము. త్రిలోకములకును గురువగు శ్రీకృష్ణుడు మమ్ము రక్షించుగాక! నేను కృష్ణుని సేవించెదను. కృష్ణుని చేత అమరశత్రులు-అసురులు చంపబడిరి. కృష్ణుని కొఱకు నమస్కారము. ఈ జగత్తు కృష్ణుని వలన పుట్టినది. నేను శ్రీకృష్ణునకు దాసుడను. ఈ సమస్తమును శ్రీకృష్ణుని యందు నెలకొనియు న్నది. ఓ కృష్ణా! రక్షింపుము. కులశేఖరులు ఎనిమిది విభక్తులను ప్రయోగించి శ్రీకృష్ణమూర్తిని స్తుతిం చినారు. కృష్ణుడు రక్షించుగాక -- ప్రథమావిభక్తి కృష్ణుని సేవించెదను -- ద్వితీయావిభక్తి కృష్ణుని చేత అసురులు సంహరింపబడిరి -- తృతీయావిభక్తి కృష్ణుని కొఱకు నమస్కారము -- చతుర్థీవిభక్తి కృష్ణుని వలన ఈ జగమంతయు పుట్టినది -- పంచమీవిభక్తి కృష్ణునకు నేను దాసుడను -- షష్ఠీవిభక్తి కృష్ణుని యందు ఈ జగమంతయు నెలకొని యున్నది-సప్తమీవిభక్తి ఓ కృష్ణా! నన్ను రక్షింపుము -- సంబోధన ప్రథమావిభక్తి