भारतकोश
मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)

मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)

Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary

कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा

DevanagariHindipublished167 पृष्ठ

पृष्ठ 145, कुल 167 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 145

138 ముకుందమాల స్వామి : కృపచేయు మనుచున్నావు. నీవు పాపివి కదా! తగని వాడవే! కుల : స్వామీ! నీవు కరుణామూర్తివి కదా! క్షమించు శక్తి కలవాడవు. నేను కృపకు తగనివాడనైనను నీవు పరమ కారుణికుడ వగుటచేత నన్ను రక్షింపవచ్చును. స్వామి : నీకేమి అనర్థము సంభవించినది? కుల : ఈ ముకుందమాలయందు 13, 14 శ్లోకములందు వర్ణిం పబడినట్టి సంసారసాగరమున మునిగితిని. దీనుడను. నీవు అనంతుడ వగుటచేత నన్ను గట్టెక్కించవలయును. అందుచేతనే నీకు 'హరి' యను పేరు వచ్చినది. స్వామి : నన్ను జూచి ప్రార్థింపవలయునా? బ్రహ్మాదుల నడుగ రాదా? కుల : స్వామీ! బ్రహ్మాదులు పురుషులు. నీవు పురుషోత్తము డవు. నీకు మీదివాడు లేడు. యస్మాత్ క్షర మతీతోఽహ మక్షరాదపి చోత్తమః, అతోఽస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః గీత. 15 అధ్యా. 18 శ్లోకములో చెప్పియున్నావు కదా! బ్రహ్మాదులకు పైవాడవగు నిన్నాశ్రయించుట సమంజసము గాని నీ క్రిందివారును, అశాశ్వతమైన స్థానమున నుండువారును అగువారి నాశ్రయింపనగునా? అచ్చటికి పొమ్ము, ఇచ్చటికి పొమ్ము అనకుము. సంసారసాగరమును దాటించుటలో వారు నీ సరికారరు. కాన నిన్ను ప్రార్థించుచున్నాను. దయా నిధివిగాన నిన్ను నమ్మి అడుగుచున్నాను: నిన్ను విడువను. ఎటులైనను కాపాడుము.