मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)
Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary
कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा
पृष्ठ 48, कुल 167 में से
संदर्भ में पढ़ेंముకుందమాల 41 నీవు సర్వసముడవు. ఆకాశమువలె నంటి యుంటక ఉన్నావు. స్వామి : నీవు న న్నాశ్రయించితివి. న న్నాశ్రయించినవారు వ్యర్థులు కారాదు. ఏదియైన నడుగుము., అట్లు దేనినైన నడుగు వాని యెడ నేను నా ప్రభుత్వము చూప వచ్చును గాని యేమియును వలదను వాని యెడ నేమి చూపవచ్చును? కుల : అట్లయిన నడిగెదను. అనేక జన్మ విశేషములందును నీ చరణారవిందములందు అచంచలభక్తి కలిగియుండనిమ్ము. స్వామి : ఇంతమాత్రమేనా కోరుట? కుల : దీనినే గొప్పగ భావించితిని. తదితరము నట్లు తలపరాదు. జ్ఞేయం యత్త త్ప్రవక్ష్యామి యద్ జ్ఞాత్వామృతమశ్నుతే, అనాదిమత్పరం బ్రహ్మ న సత్త న్నాసదుచ్యతే. -- గీత. 13.13 మాం చ యోఽ వ్యభిచారేణ భక్తియోగేన సేవతే, స గుణాన్ సమతీ త్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. -- గీత. 14.26 అను శ్లోకములలో చెప్పిన అనన్యభక్తి నిమ్ము. (భగవంతు నాశ్ర యించి యేదేని కోరిన పక్షమున స్వల్పఫలముతోనే సరిపోవును. వాని నాశ్రయించి యేమియును కోరని పక్షమున-- అనన్యా శ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే, తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్. -- గీత. 9.22 అనునట్లు యోగక్షేమములు వాని తలమీదనే పడునని కులశేఖరులు తెలియజేయుచున్నారు.