मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)
Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary
कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा
पृष्ठ 50, कुल 167 में से
संदर्भ में पढ़ेंముకుందమాల 43 స్వామి : ఇంత సాహసముతో మాటలాడనేల? కుల : స్వామీ! నరకాదులను గూర్చిన చింత నాకేల యుండవల యును? నరకాంతకుడని మిమ్మేల పిలిచితినో యెఱుగరా? స్వామి : నరకాసురుని జంపితిని గాన నటులు పిలిచితివి. కుల : స్వామీ! బ్రహ్మాదులు ప్రార్థించినందున రావణుని జంపితివి. ఇంద్రాదులు ప్రార్థించుట చేత నరకాసురుని జంపితివి. ఆ సంగతి నాకంత ముఖ్యమైనది గాదు. నేను జీవాత్మను. హీనుడను. ఏ స్థలమున వసించినను అందుచేత నాకు. గౌరవము, అగౌరవము అనునవి హెచ్చవు, తగ్గవు. నే నధ మాధముడను. కాని నిన్ను నమ్మియుండు నేను నరకమున బడుదునేని నీవు వహించియుండు నరకనాశకుడను బిరుదు తోడనే తొలగిపోవును. అందువలన నన్ను గూర్చిన చింత నీది గాని, నాది కానేరదు. అభూతపూర్వం మమ భావి కిం వా సర్వం సహే మే సహజం హి దుఃఖమ్, కింతు త్వదగ్రే శరణాగతానాం పరాభవో నాథ! న తేఽనురూపః. -- ఆళవందార్‌స్తోత్రమ్ 25. నాథా! నే నిదివఱ కెన్ని హీనజన్మములో పొందియున్నాను. ఆ విషయము నాకు క్రొత్తకాదు. నాకు అదే సహజము. అనన్యభావముతో దలచుచుండు నన్ను రక్షింపవేని శరణాగత వత్సలుడు, 'దీనబంధుడు, పర మదయాళుడు అను నీ పేర్లు తోడనే పోవునని దుఃఖించుచున్నాను. ఆ పేర్లను కాపాడుకొనుడని విన్నవించుచున్నాను గాని నన్ను రక్షింపవలయు నని ప్రార్థించలేదు-అని ఆళవందారు భగవంతునితో విన్నవించిరి.