भारतकोश
मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)

मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)

Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary

कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा

DevanagariHindipublished167 पृष्ठ

पृष्ठ 51, कुल 167 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 51

44 ముకుందమాల భగవంతుడు కాపాడునని భక్తిశ్రద్ధాపురస్సరముగ భజించిన యెడల ఆ భక్తులు యమదూతలను జూడరు; స్వప్నమందైనను జూడరు అని భాగవత మున జెప్పబడెను. తొండరడిప్పొడి యాళ్వారుల 'తిరుమాలై' తొలిపాశురమున భగవన్నా మము ననుసంధించువారు యమునియొక్కయు, అతని దూతలయొ క్కయు భయములేక వారిని తిరస్కరింప గలిగిన విధము చెప్పబడెను. ఆ పాశుర మిది. కావలిల్ పులనై వైత్తుక్కలి తన్నైక్కడక్కప్పాయ్న్దు నావలిట్టుళి తరుకిన్ఱోమ్ నమన్తమర్ తలై కళ్మీతే మూవులగుణ్డుమిళ్ న్దము తల్వ నిన్ నామమ్ కత్త ఆవలిప్పడైమై కణ్డా యరఙ్గమాన కరుళానే. స్వామి : ఏ కోరికలును లేని పక్షమున న న్నాశ్రయింపనేల? కుల : స్వామీ! శరత్కాల కమలమును తిరస్కరించునట్టి నీ చరణములను స్మరింపవలసియుండుటచేత ని న్నాశ్రయించి తిని. (వసంత గ్రీష్మ ఋతువులందు ఎండగా నుండును. వర్షఋతువునందువాన, హేమంత ఋతువునందు మంచు, శిశిరఋతువునందు చలిగాలిగా నుండును. శరత్కాలము నందలి చంద్రుని కవులు వర్ణింతురు. కులశేఖరులు కవి గాదు. భక్తిరసమును అనుభవించి యితరులను అనుభవింప జేయువారు. అట్టివా రయ్యును వారు స్వామి పాదము యొక్క కార్యమును చెప్పక వర్ణించిరి. ఇది భగవంతునికి అంత తృప్తిగ తోచలేదు.) స్వామి : యాచింపవచ్చినవాడు వచ్చినపని చూచుకొని పోవలయును అట్లుగాక కవిమాడ్కి నా పాదములను వర్ణింపనేల?