भारतकोश
मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)

मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)

Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary

कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा

DevanagariHindipublished167 पृष्ठ

पृष्ठ 52, कुल 167 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 52

ముకుందమాల 45 కుల : స్వామీ! నేను మీపాదములను వర్ణింపబూనలేదు. 'అవధీ రిత శారదారవిందౌ' అని నీ పాదములయొక్క కార్యమును దెలిపితిని. శారద=అనేక సంవత్సరములుగానుండు, అ=అధికమైన, రవిందం= అంధకారమును, అవధీరిత=పోగొట్టును. అందుచేతనే నీ పాదచింతనము నడిగితిని. నీయొక్క వ్రేలినఖమే కోటిసూర్యోదయప్రకాశమట్లుండును. ఇక రెండుపాదములందలి పదినఖముల కాంతి చేరెనేని ఎట్టి యజ్ఞానాంధకార మైనను పాయకుండునా? స్వామి : అ ట్లేవరయిన నా పాదములను తమ హృదయాకాశమునం దుంచుకొని అజ్ఞానాంధకారమును బోగొట్టుకొనిరా? కుల : బ్రహ్మాదు లట్లు చేసియున్నారు. భాగవతమున నక్రూరుడు శ్రీకృష్ణ దర్శనార్థముపోవుచుండి మార్గమధ్యమున రథము దిగి "కంసా! . నీకు నమస్కారము. సనకాదులు నార దాదులు ఏ భగవంతుని పాదనఖకాంతిచేత కోటిసూర్యులు, నక్షత్రములు, అగ్ని ప్రకాశము వీనిచేత కాని, అజ్ఞానాంధ కారమును పోగొట్టుకొనిరో, ఆ భగవంతుని పాదములను సేవింపబోవుచున్నాను గదా యని ఆనందించెదను అనెను. ఈ కారణములచేత నీ పాదస్మరణము నడిగితిని. స్వామి : మూడవ శ్లోకమున 'అవిస్మృతిః'=మఱపులేని స్మృతిని అడిగి తివి. నాల్గవ శ్లోకమున 'భావే భావే'=ప్రతిజన్మమునను అని అడిగితివి. ఐదవ శ్లోకమున 'త్వత్పాదాంభోరుహయుగగతా నిశ్చలా భక్తిరస్తు'=నీపాదములందు నిశ్చలభక్తి యుండ వలయునని కోరితివి. నీ వడుగునట్లు సదాధ్యానమును కలిగించుటకు సరిపడునా?