मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)
Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary
कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा
पृष्ठ 54, कुल 167 में से
संदर्भ में पढ़ेंముకుందమాల 47 కృష్ణా! నీ పాదకమలము లనెడు గూటి మధ్యమున నామనస్సనెడి రాజహంసమును ఇపుడే ప్రవేశింపనిమ్ము. ప్రాణప్రయాణ సమయము నందు కఫవాతపిత్తములు కంఠమును గ్రమ్ము కొనగా నీతలం పెక్కడిది? కులశేఖరులు : స్వామీ! సదా నీ స్మరణమును కలిగించుటకు కాకున్నను మరణకాలమం దైనను కలుగునట్లు చేయుము. స్వామి : మరణకాలమున నా స్మరణ కలుగవలయు నంటివి, అది మిక్కిలి నాజూకైన కాలము. అపు డెట్లు స్మరణ కలు గును? కుల : అందుచేతనే ఇపుడే నీ స్మరణ కలుగవలయునని కోరె దను. ఆ సమయమున నా ప్రయత్నముచేత కలుగదు. నీవే కలిగించవలయును. ఆ ప్రాణ ప్రయాణ సమయ మున కఫవాత పిత్తములు ముంచుకొని యుండగా ని న్నెట్లు ధ్యానింపనగును? అందుచేత నా మనస్సనెడి రాజహంసము తమ పాదకమలము లనెడు పంజరము యొక్కనడుమ ఇపుడే ప్రవేశింపనిమ్ము. హంసపక్షి జల మున సంచరించునట్టిది. అది సాధారణముగ నెక్కడను కనబడదు. కుబేరుని మానస సరస్సున సంచరించుచుం డును. అది మిగుల తెల్లగనుండు శకుంతము. కులశేఖరులు మనస్సును రాజహంస యని చెప్పుటకు కారణ మేమి? నా మనస్సనెడు చిలుకను అనియనరాదా అనగా, తదితర పక్షులు రజోగుణ తమోగుణములయొక్క రంగులు గలవి. హంసము సాత్త్వికగుణముయొక్క రంగు గలది. శుద్ధశ్వేతవర్ణము గలది. నా మనస్సనెడు రాజహంస నీ పాదములను పంజరమును ప్రవేశింపనిమ్ము అనగా నా మనస్సు రాగద్వేష ములచేత విడువబడి శుద్ధసత్త్వాత్మకమైన నీ చరణమున ప్రవేశింపనిమ్ము అని ప్రార్థించుట.