भारतकोश
मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)

मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)

Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary

कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा

DevanagariHindipublished167 पृष्ठ

पृष्ठ 55, कुल 167 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 55

48 ముకుందమాల హంస కోరునది తామరపుష్పముగాన ఈ హంసము ఆ తామరపుష్ప మున ప్రవేశింపనిమ్ము అనిరి. ఇపుడే ప్రవేశింపనిమ్ము-అనుటచేత స్వామీ! నేడే నీ చరణారవిందమున ప్రవేశింపవలెను. నేడే నీ యనుగ్రహమున ప్రవేశించిన మనస్సు బయట రారాదు. నాయొక్క మనోహంసము బయట తిరుగుచున్నది. పోరాని తావులకు బోవుచున్నది. అందుచే నీ పాదా రవింద మను గూటియందు ప్రవేశింపజేయుము అని ప్రార్థించిరి. 'అంతే నారాయణస్మృతిః' అనియుండగా నారాయణుని దలపవలయునని కోరక వాని చరణమును ధ్యానింపవలయునని కోరుటేల? యనగా ద్వయమంత్ర మునందును చరణౌ అనిరి. (శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే, శ్రీమతే నారాయణాయ నమః-అనునది ద్వయము) నదియందు దిగుటకు రేవు కావలసినట్లు శేషభూతుడైన ఆత్మ స్వామివద్ద చేరుటకు వాని పాదములు రేవుగ నున్నవి. శిరస్సు ఉత్తమాం గము, పాదము అధమాంగము. అట్టి యంగమునే ఆశ్రయించవలయును. భాగవతము మూడవస్కంధమున దేవహూతికి కపిలుడు ధ్యానము సంగతి చెప్పనపుడు చరణధ్యానమునే ప్రథమమున దెలిపెను. అతని పాదము వజ్రాదిరేఖలతో గూడినది. తిరుప్పాణి యాళ్వారులు 'అమలనాథ పిరాన్' అను గ్రంథమున పాదములనే ముందు వర్ణించిరి. ప్రణవార్థమైన 'అమలనా థపిరాను'నందు శ్రీరంగనాథుని చరణారవిందములు వచ్చి నా కన్నులలో దూరిన వనిరి. చిన్న అణువు పడిననే చూచుటకు కష్టమగును. గొప్ప పాదములు పడినందున నింకొకటి చూడజాలనని చెప్పిరి. వేదాంతదేశికులు భగవద్ధ్యానసోపానము నందును ప్రథమమున పాద ములను వర్ణించిరి. క్రమధ్యానము కల్గుటకు ఖండధ్యానము చేయవలయును. మేడమీదికి పోగోరువాడు మెట్టుమెట్టుగ పోవలయును గాని ఒకే పర్యా యము దూకిన పోగలడా? భగవంతుని యొక్కొక్క అవయవమును