भारतकोश
मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)

मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)

Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary

कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा

DevanagariHindipublished167 पृष्ठ

पृष्ठ 72, कुल 167 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 72

ముకుందమాల 65 దును. నీవు చెప్పెడు స్థలము నాకు రక్షకమైన దేనా? కేవలము అందము మాత్రమే యుండి ప్రయోజనమేమి? కుల : మనసా! కేవలసౌందర్యవిగ్రహుడై యుండిన నే నట్లు చెప్పెదునా? అతడు శంఖచక్రములను ధరించియు న్నాడు. అతని చక్రము లోకమునే కాల్చును. అతని శంఖధ్వనిని వినిన యెడల పదునాల్గులోకములు భయ పడును. దుష్టులను పలాయితుల గావించుటకు అతని యొద్ద శంఖచక్రము లున్నవి. మనస్సు : శంఖచక్రము లున్నవని చెప్పుచున్నావు. చిత్రమున లిఖింప బడిన స్వామికి గూడ శంఖచక్రము లున్నవి. వానివలన ప్రయోజనమేమి? నీవు చెప్పు ఆయుధములు చిత్రలిఖిత మైన వానియట్లు పనిచేయకుండునా? లేక ఉపయోగప డునా? కుల : సమయము తటస్థించినపు డవి శత్రునిరసనము గావిం చుచుండును. మనస్సు : ఎవ్వరి నైనను హతము గావించెనా? కుల : నరకాసురుని మిత్రుడును, ఐదుతలలు గలవాడును అగు మురాసురుని చంపెను. మనస్సు : ఏమో! నీ మాట విని ప్రవేశించితిని. నాకేమో సుఖము తెలియదు. సుఖము గలుగునా? కుల : మనసా! నీవు ప్రవేశించియుండు స్థలమునకంటెను మించిన స్థలముండనేరదు. మనస్సు : ఏదేని మంచివస్తువును భుజించినను లేక మంచివస్తువు యొక్క సంగతి వినినను ఇట్లే అనేక విషయములచేత కలుగు సుఖములను బోలియుండునా నీవు చెప్పుసంగతి? కుల : నీవు చెప్పనవి సుఖములని తోచినగదా వానివలెనుండు నని చెప్పగలను. సుఖమన నేను చెప్పనది యొక్కటే 6