मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)
Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary
कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा
पृष्ठ 82, कुल 167 में से
संदर्भ में पढ़ेंపల్లము నందలి జలమును దాటినట్లు, దాట నగునని చెప్పెను. ఇట్టి కారణములచేత మనసా! నీవు పోయి లయించుము. స్వామి గట్టెక్కించును. వానికి కావలసినది కూలి. ఆ కూలి నీవే. నిన్ను సమర్పించిన యెడల గట్టెక్కించును. ఆ స్వామియే యోడ యగును. అందుచే తనే 10, 11 శ్లోకములందు వానిని ధ్యానించవలయు నంటిని. నీవు వెనుకకు రాకుము. పాపినని భయపడకుము. 11శ్లోకమున జెప్పినట్లు అతడు స్వామిగ నున్నాడు. ప్రక్కను తల్లియున్నది. లోకముల వ్యసనము లను బోగొట్టువాడు నమ్మియుండు మనలను -- దైవీ హ్యేషా గుణమయీ మమ మాయాదురత్యయా, మామేవ యే ప్రపద్యంతే మాయా మేతాం తరంతి తే. -- గీత. 7.14 పైశ్లోకమునందు వలె కాపాడును. పైసంసారసాగరమునబడి దాని యందు గల బాధలను పొందియుండు నరులకు విష్ణువను ఓడయే శరణమగును. 13 భవజలధి మగాధం దుస్తరం నిస్తరేయం కథమహ మితి చేతో మా స్మ గాః కాతరత్వమ్, సరసిజదృశి దేవే తావకీ భక్తిరేకా నరకభిది నిషణ్ణా తారయిష్యత్యవశ్యమ్. చేతః=ఓమనసా!, అగాధం=లోతైనదిగనుకనే, దుస్తరం=దాటశక్యము గాని, భవజలధిం=సంసారమనెడు సముద్రమును, కథం=ఎట్లు, అహం=నేను, నిస్తరేయం=దాటగలను, ఇతి=అని, కాతరత్వం=పిరికితనమును, మా స్మ గాః=పొందవద్దు, సరసిజదృశి=కమలములవంటి నేత్రములుగల, దేవే=భగ వంతుడగు, నరకభిది=నరకాసురుని సంహరించిన శ్రీ కృష్ణునియందు,