भारतकोश
मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)

मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)

Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary

कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा

DevanagariHindipublished167 पृष्ठ

पृष्ठ 83, कुल 167 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 83

76 ముకుందమాల నిష్ఠా=కూర్చుండిన, తావకీ=నీదైన, భక్తిః ఏకా=భక్తి యొక్కటే, అవశ్యం=ముఖ్యముగా (త్వామ్=నిన్ను), తారయిష్యతి=దరిజేర్చగలదు. ఓ మనసా! లోతైనదియును, దాటరానిదియు నగు సంసారసాగర మును నే నెట్లు దాటగలనని తల్లడిల్లకుము. తామరసాక్షుడును, నరకాం తకుడును అగు భగవంతునియందు (శ్రీకృష్ణదేవునియందు) నిలుపబడిన నీ భక్తి యొకటియే నిన్ను అవశ్యము ఈ సాగరమును దాటించును. మనస్సు : భగవంతునకు నన్ను సమర్పించిన పక్షమున నతడు కాపాడు నంటివి. ఆ విషయమున నాకు ధైర్యము కలుగలేదు. కులశేఖరులు: మనసా! తనయందు లయింపజేయవలయునను తలంపు తోనే భగవంతుడు నిన్ను దయచేసియున్నాడు. మనసును సాధనముగ జేసి కొనవలయుననియే భగవదభిప్రాయము. ఉద్ధరే దాత్మనాత్మానం నాత్మాన మవసాదయేత్, ఆత్మైవహ్యాత్మనో బంధు రాత్మైవ రిపురాత్మనః. -- గీత. 6.5 అనినట్లు మనసును బంధువుగ జేసికొని సుఖపడవలయునను తలంపు తోనే ని న్నతడు కరుణించెను. దయాపూర్వకముగ నిచ్చిన మనస్సుతో సుఖపడలేని నావలననే వీరు చెదిరిగదా యని స్వామి చింతించును. కాన నిన్ను సమర్పించు పక్షమున నతడు సంసారసాగరమును దాటించును. సంసారసముద్రమునబడి శ్రమపడు చుండు నేను కాపాడ బడుదును. మనస్సు : మీరు చెప్పిన దంతయు యుక్తముగనే యున్నది. మిగుల శ్రమపడు పక్షమున సముద్రమును దాటనగును. హనుమంతు డును దానిని దాటియున్నాడు. సంసారసాగరమును దాటుట మాత్రము కష్టము. నన్ను కూలిగ నిచ్చి సంసారస