भारतकोश
संग्रह पर लौटें

मुकुन्दमाला स्तोत्रम् (कुलशेखर आलवार - संस्कृत मूल एवं सान्वय हिन्दी व्याख्या)

Mukundamala Stotram of Kulasekhara Alwar with Commentary

कुलशेखर आलवार (राजा कुलशेखर) द्वारा

DevanagariHindipublished167 पृष्ठ

[Header] ముకుందమాల 157

నము చెందిరి. నేను ఆ రావణుని చంపదలచి యుంటిని. మా స్వామియే సంహరించిరట. అతడు సుఖముగ నున్నాడని తెలిసినదని తాను సుఖముగ నుండెను. కులశేఖరులు సదా తిరుప్పావును అనుసంధానము చేయుచుండిరి. కులశేఖరులు ముం దవతరించిరి. ఆండాళమ్మ వెనుక అవతరించిరి. ఇది అసంభవము కాదా యనిన నెంత మాత్రము కాదు. శ్రీభూనీళాదేవులు నిత్యురాండ్రు. నిత్యురాలైన భూమియే ఆండాళుగ నవతరించిరి. వారిచేత రచింపబడిన ప్రబంధములును నిత్యమే. ఆమె తిరుప్పావును ఈ అవ తారముననే చేసెనని తలంపరాదు. పూర్వమే యేర్పడియున్నది. అందుచే కులశేఖరులు తిరుప్పావు ననుసంధించుట అసంభవముగాదు. రాజునకు వైష్ణవస్వాములయందు ద్వేషము పుట్టించవలెనని మంత్రు లాలోచించిరి. ఇట్లుండగా శ్రీరామనవమి యుత్సవము వచ్చెను. స్వామి కభిషేకము చేయునపుడు సకలాభరణములను తీసియించిరి. మరల నలం కరించునపుడు ఒక ముత్యాలహారము కనబడలేదు. భటులు కావలియుండి నను ఆ యాభరణ మెటులో పోయెను. ఈ సంగతి తెలిసిన పిమ్మటనే స్వామికి పూజ జరుగవలెనని రాజు ఆజ్ఞాపించెను. ఇదే సమయమని హార మును దాచియుంచిన వారిలో ముఖ్యమంత్రి ముందుకు వచ్చి “ప్రభూ! ఆ హారమును దొంగిలించినది మీకు పరమహితులయి యుండిన యీ శ్రీవైష్ణవులే అని ఖైది చేసి యుంచిన స్వాములను జూపెను. కులశేఖరులు పరమభాగవతోత్తములైన ఆ స్వాములను జూచి “నేను నమ్మను. పరమైకాంతులగు వీరితోడ బహుకాలముగ మెలగుచున్నాను. ఈ మాటను మీరెట్లనగలిగితిరి?” అనెను. ఇంత వైష్ణవపక్షపాతముండబట్టియే యింత యనర్థము తటస్థించెనని మంత్రు లనిరి. “పేదవా రిందు రారు. వీ రీ కార్యము చేయరు. నే నొక యేర్పాటు చేసెదను” అని పలికి బుసకొట్టుచుండు నొక పామును దెచ్చి యొక

158 ముకుందమాల

బిందెలో వేసి “వీ రీ కార్యము చేసిరని ఈ బిందెలో చేతి నుంచు” డని రాజ చెప్పగా మంత్రులట్లు చేయలేదు. “వీ రట్లు చేసియుండరని మీరు చేయియుంచు” డని వా రడుగగా కులశేఖరులు చేయివేసి పాము నెత్తి “మీరిట్లు చేయు” డనగా వారు పరుగెత్తిపోయిరి. కులశేఖరులు ఆ దుష్టులకు దండన విధించి, వైష్ణవులను విడిపించి “ఏ భాగవతులను భగవంతునికంటె హెచ్చుగ పూజించుచున్నానో, అట్టివారియందు దోషము కల్పించిరి. ఇక వీరితో సహవాసము కూడదని నిశ్చయించి తన పుత్తుఁ డగు దృఢవ్రతునకు రాజ్యమొసగి ముఖ్యులగు కొందఱు స్వాములతో శ్రీరంగమునకు పోయి శ్రీరంగనాథుని సేవించి, శ్రీరంగనాథుని యందు అతిభక్తిగలదియు, నీళాదేవియొక్క అంశజురాలును అగు తన కొమార్తెను ఉదధారాపూర్వకముగ శ్రీరంగనాథునకు సమర్పించి తనకు గల సంపదను వరదక్షిణగ నిచ్చెను. కులశేఖరు లిట్లు కొంతకాలము శ్రీరంగమున సుఖముగ నుండి పిమ్మట తిరుమల, కాంచి మొదలగు కొన్ని దివ్యదేశములకు పోయి ఆళ్వారు తిరునగరికి, పిమ్మట మన్నారు కోవెలకు పోయి శ్రీరాజగోపాల స్వామిని సేవించి తన అరువది యేడవ యేట అచటనే పరమపదము నొందిరి. కులశేఖరులు ముకుందమాల యొనర్చి భక్తిలేని వారికి భక్తి గలిగిం చిరి. భక్తిరసము గల ‘పెరుమాళ్ తిరుమొళి’ని రచించిరి. దానికి పెరియవాచ్ఛాంబిళ్ల వ్యాఖ్యానము వ్రాసిరి. శ్రీకులశేఖ రాళ్వార్ తిరువడిగళే శరణమ్.

इस पृष्ठ पर कोई देवनागरी पाठ (श्लोक, सूत्र, अनुवाद या टिप्पणी) उपलब्ध नहीं है। यह पृष्ठ केवल भगवान श्री वेंकटेश्वर (बालाजी/श्रीनिवास) के विग्रह के चित्र/रेखाचित्र का है।

इस पृष्ठ पर कोई देवनागरी पाठ (श्लोक, टीका अथवा सूत्र) उपलब्ध नहीं है; यह केवल भगवान् के श्रीविग्रह (मूर्ति) का चित्र-पृष्ठ है।

T.D. Religious Publications Series No. 398 PRICE Rs. 16—00 Printed and Published by Sri D.V.L.N. Murthy, I.A.S., Executive Officer, T.T. Devasthanams and Printed at T.T.D. Press, Tirupati– Dt.30-4-1994.