चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)
Chakradatta Hindi
महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा
स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)
पृष्ठ 236, कुल 674 में से
संदर्भ में पढ़ेंఆంధ్ర తాత్పర్యసహితము. 217
దశమూలములు త్రిఫలములు మ్రానిపసపు పచ్చిపసపు కొడిసెపట్ట విదాకుల యరటి ఉత్తరేణువేళ్లు పుష్కరమూలము నీలికటుకరోహిణి రేలచెక్క బ్రహ్మమేడి వీటిని రెండురెండు పలముల చొప్పున తీసికొని ద్రోణము నీటిలో వండి నాల్గవపాలు నీరు మిగిలియున్నపుడు గంటుభారంగి అగరుశొంతి శొంతి మిరియములు పిప్పళ్లు తెల్ల తెగడ నీటిప్రబ్బలి కరక్కాయలు చాగ దంతి నేలవేము చిత్రమూలము మనుబాల రోహిషమను కసవు వాము అడవిమల్లె వీనినన్నిటిని ఒక్కొక్క కాలపలము చొప్పున నూరి 16 పలముల నేతితో పక్వము చేయవలయును కాని ఘృతమును సిద్ధము చేయునప్పుడు ఆవుపేడరసము పెరుగు పాలు గోమూత్రము వీటిని సమానభాగములను తీసికొని సిద్ధము చేయవలయును. ఇయ్యది బృహత్పంచగవ్య ఘృత మనఁబడును. అపస్మారములను జ్వరములను దగ్గులను శోఫలను ఉదరరోగములను బల్లను మూలరోగములను పాండురోగములను కామెరలను హలీమక మను రోగమును దరిద్రమును గ్రహబాధలను పిశాచబాధలను చాతుర్థికజ్వరములను పోఁగొట్టును.
మహాచేతసఘృతము.
శ్లో. శణ త్రైవృతైరండో దశమూలీ శతావరీ. 24.
రాస్నా మాగధికా శిగ్రు క్వాథ్యం ద్విపలికం భవేత్, విదారీమధుకం మేదే ద్వే కాకోల్యా సితా తథా. 25.
ఏభిః ఖర్జూరమృద్వీకా భీరు యంజాత గోత్సురైః, చేతసస్య ఘృత స్యాంగైః పక్తవ్యం సర్పిరుత్తమం. 26.
మహాచేతససంజ్ఞం తు సర్వాపస్మారనాశనమ్, గరోన్మాదప్రతిశ్యాయ తృతీయకచతుర్థకాన్. 27.
పాపాలక్ష్మ్యా జయే దేత త్సర్వగ్రహనివారణమ్, కాసశ్వాసహరం చైవ శుక్రార్తవవిశోధనం. 28.
ఘృతమానః క్వాథవిధి రిహ చేతసవన్నతః, కల్కైశ్చేతసకల్కోత్థై ర్ద్రవ్యై స్సార్థం చ పాదికః. 29.
నిత్యం యంజాతకాప్రాప్తా తాలమస్తక మిష్యతే.
జనుపవిత్తులు తెల్లతెగడ చిట్టాముదము దశమూలములు పిల్లిపీచ్చర సన్నరాస్న పిప్పలి మునగ వీటితో చేసినకషాయములో యష్టిమధుకము మేద మహామేద నేలగుమ్ముడు కాకోలి క్షీరకాకోలి చక్కర ఖర్జూరపుపండ్లు ద్రాక్ష పెద్దపీచర పల్లేరు వీటిని రెండు రెండుపలములను చైతసఘృతములో చెప్పఁబడిన ఔషధములను చేర్చి నేతిని బాగుగ పక్వము చేయవలయును. ఇది మహాచేతసఘృత మనఁబడును.
అన్నివిధములైన అపస్మారములను పోఁగొట్టును. విషమును పిచ్చిని పీనసను మూఁడేసి నాలు గేసిరోజులకు వచ్చువరసజ్వరములను పాపమును దారిద్య్రమును పోఁగొట్టును.
28