भारतकोश
चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

पृष्ठ 309, कुल 674 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 309

290 చక్రదత్త—౨౬. శూలాధికారము.

త్రాన్తః పాచితాం శుద్ధాం లోహచూర్ణసమన్వితాం, సగుడా మభ యా మద్యా త్సర్వశూలప్ర శాంతయే. 63.

గోమూత్రములో మందూరమును శుద్ధిచేసి త్రిఫలములచూర్ణమును కలిపి తేనె నేయి చేర్చి సేవించిన త్రిదోషజములగు శూలలు నశించును. శంఖచూర్ణము సైంధవ లవణము ఇంగువ శొంతి మిరియములు పిప్పళ్లు వీటిచూర్ణమును వేడినీళ్లతో త్రాగిన త్రిదోషజములగు శూలలు నశించును. అయస్కాంతచూర్ణమును త్రిఫలములచూర్ణమును తేనెతో నేతితో రంగరించి నాకిన అన్నివిధములగు శూలలునశించును. కరక్కాయల ఆవుమూత్రముతో వండి శుద్ధిచేసి మందూరము బెల్లము కలిపి సేవించిన అన్నిశూల లును నశించును.

దాధికఘృతము.

శ్లో. పిప్పలీనాగరం బిల్వం కారవీ చవ్యచిత్రకమ్, హింగు దా డిమ వృక్షామ్ల వచా క్షారామ్లవేతసమ్ 64. వర్షాభూ కృష్ణలవణ మజా జీ బీజపూరకమ్, దధి త్రిగుణితం సర్పి స్తత్సిద్ధం దాధికం స్మృతమ్. 65. గుల్మహృః ప్లీహహృత్పార్శ్వశూలయోని రుజాపహం. 65. దోషసంశ మనం శ్రేష్ఠం దాధికం పరమం స్మృతం. 66.

పిప్పళ్లు శొంతి మారేడు నల్లజీలకఱ్ఱ చవ్యము చిత్రమూలము ఇంగువ దానిమ్మ చింతపండు వస ఆమ్లవేతస శొంతి సౌవర్చలవణము జీలకఱ్ఱ మాచికాయ సీతికల్క మును పుల్లని పెరుగుతో నేతిని సిద్ధముచేసి సేవించిన గుల్మము మూలరోగము ప్లీహ పార్శ్వపునొప్పి యోనిబాధ మున్నగు వానిని పోఁగొట్టును.

ధూపములు.

శ్లో. కంబలావృతగాత్రస్య ప్రాణాయామం ప్రకుర్వతః, కటుతై లాక్తసక్తానాం ధూపః శూలహరః పరః. 67. వ్యాయామం మైథునం మద్యం లవణం కటువై దలం, వేగరోధం శుచం క్రోధం వర్జయే చ్ఛూ లవా న్నరః. 68.

కంబడి కప్పుకొన్నవానికి, ప్రాణాయామము చేయువానికి కటుతైలములతో తడిసిన సత్తువులను ధూపమువైచినచో శూలలు నశించును. వ్యాయామము మైథునము కల్లు ఉప్పు చేదు వెదురుబియ్యపు అన్నము మలమూత్రవేగరోధము దుఃఖము కోపము వీటిని శూలరోగీ వదలిపెట్టవలయును.

ఇట్లు చక్రదత్తయందు శూలరోగాధికార ప్రకరణము ముగిసెను.