भारतकोश
चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

चक्रदत्त (चक्रपाणिदत्त - पदार्थचन्द्रिका व हिन्दी व्याख्या सहित)

Chakradatta Hindi

महामहोपाध्याय चक्रपाणिदत्त द्वारा

स्रोत: Chakradatta Chikitsa Sangraha with Hindi Commentary (उद्गम)

DevanagariHindipublished674 पृष्ठ

पृष्ठ 325, कुल 674 में से

संदर्भ में पढ़ें
पृष्ठ 325

306 చక్రదత్త—౨౯. గుల్మాధికారము.

మూత్రములతోరంగర్చి మూకుడులో పెట్టి మూసికట్టి పెట్టి పక్వము చేసి పిమ్మట నూరి సైంధవలవణమునుకలిపి అన్న పానములతోతినిన ఆనాహములు నశించును. పుష్కరమూలము ఇంటిబూజు అంటుప్పు శొంఠి మిరియములు పిప్పళ్ళు బెల్లము గోమూత్రము వీటినినూరి అంగుష్ఠ మంతలావువత్తిచేసి కాచి గుదస్థానములో నుంచిన ఆనాహములు శూలలు నశించును. శొంఠి మిరియములు పిప్పళ్ళు సైంధవలవణము ఆవాలు కోష్టు ఉమ్మెత్త వీటితో అంగుష్ఠమంత వత్తినిచేసి గుదస్థానమున నుంచవలెను. ఇది ఆనాహోదావర్తనులను పోగొట్టును. గుల్మరోగములను నశింపఁజేయును.


❖ శుష్కమూలాద్య ఘృతము. ❖

శ్లో. మూలకం శుష్క మార్ద్రం చ వార్షాభూః పంచమూలకం,
ఆమ్లవేతసఫలం చాపి పిష్ట్వా తేన పచేద్ధృతం,
తత్పీయమానం శమయే దుదావర్త మసంశయం. 35.

  • తాత్పర్యము: ఎండినముల్లంగిని పచ్చి కప్పగంతుఆకును పంచమూలములు ఆమ్ల వేతసము వీటిని నూరి ఇందులో నేతిని పక్వముచేసి త్రాగిన ఉదావర్తము నశించును. సందేహములేదు.

❖ స్థిరాదిఘృతము. ❖

శ్లో. స్థిరాదివర్గస్య పునర్నవాయాః సంపాకపూతీకకరంజయైశ్చ,
సిద్ధః కషాయే ద్విపలాంశికానాం ప్రస్థో ఘృతా త్స్యా త్ప్రతిరుద్ధవాతే 36.

  • తాత్పర్యము: స్థిరాదిగణపుఔషధములు శొంఠి ఆమ్లవేతసము నెమలియడ్డుచెక్క వీటిని 2 పలముల చొ॥ కషాయము చేసి 16 పలముల నేయిని సిద్ధముచేసి ప్రతిరుద్ధవాతము నందు సేవించిన హితకరము.

ఇట్లు చక్రదత్తయందు ఉదావర్తాధికార ప్రకరణము ముగిసెను.


౨౯. గుల్మాధికారము.

❖ గుల్మ రోగుల భోజనపద్ధతి. ❖

శ్లో. లఘ్వన్నం దీపనం స్నిగ్ధం ముష్ణం వాతానులోమనం,
బృంహణం య ద్భవే త్సర్వం తద్ధితం సర్వగుల్మినాం. 1.
స్నిగ్ధస్య భిషజా


Sanskrit Verses in Devanagari Script (देवनागरी लिप्यन्तरम्):

श्लोकः (३५)
मूलकं शुष्कमार्द्रं च वार्षाभूः पञ्चमूलकम् ।
आम्लवेतसफलं चापि पिष्ट्वा तेन पचेद्धृतम् ।
तत्पीयमानं शमयेदुदावर्तमसंशयम् ॥ ३५ ॥

श्लोकः (३६)
स्थिरादिवर्गस्य पुनर्नवायाः संपाकपूतीककरञ्जयोश्च ।
सिद्धः कषाये द्विपलांशिकानां प्रस्थो घृतात्स्यात्प्रतिरुद्धवाते ॥ ३६ ॥

श्लोकः (१)
लघ्वन्नं दीपनं स्निग्धमुष्णं वातानुलोमनम् ।
बृंहणं यद्भवेत्सर्वं तद्धितं सर्वगुल्मिनाम् ॥ १ ॥
स्निग्धस्य भिषजा...